Sunday, June 21, 2026
Google search engine
HomeUncategorizedపొలిటికల్ డ్రామాగా విశ్వక్ సేన్ ‘లెగసీ’..

పొలిటికల్ డ్రామాగా విశ్వక్ సేన్ ‘లెగసీ’..

ఒకే తరహా సినిమాలు చేయకుండా విభిన్న పాత్రలు, భిన్నమైన కథలతో ముందుకెళ్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. ఇప్పుడు ఆయన సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో కలాహీ మీడియా పతాకంపై ’లెగసీ’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. నూతన సంవత్సర సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ, అద్భుతమైన టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ’లెగసీ’ ఒక రాజకీయ నేపథ్యంతో సాగే కథ. అత్యంత ప్రభావవంతమైన రాజకీయ నాయకుడైన తన తండ్రి వారసత్వాన్ని అనివార్యంగా మోయవలసి వచ్చే సిద్ధార్థ్ అనే యువకుడి కథగా ఇది రూపొందుతోంది. వారసుడు లేని కుర్చీ చుట్టూ తిరిగే అవకాశవాద రాజకీయ రాబందులను తాను ఎంతగా ద్వేషిస్తాడో చెప్పే విశ్వక్ సేన్ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది.

క్రూరంగా, రూఢిగా, దుఃఖంతో నలిగిపోయిన, మనసు విరిగిపోయిన, మొరటు వ్యక్తిగా విశ్వక్ సేన్ తన పాత్రలో అద్భుతంగా మెప్పించారు. దర్శకుడు సాయి కిరణ్ దైదా ఒక ఉత్కంఠభరితమైన పొలిటికల్ డ్రామాకి ప్రాణం పోసేందుకు సిద్ధమయ్యారు. నిర్మాతలు యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తుండగా, రావు రమేష్, సచిన్ ఖేడేకర్, మురళీ మోహన్, కేకే మీనన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments