Sunday, June 21, 2026
Google search engine
HomeUncategorizedపవన్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. సురేందర్ రెడ్డితో కొత్త చిత్రం

పవన్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. సురేందర్ రెడ్డితో కొత్త చిత్రం

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ’ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ’దేఖ్‌లేంగే సాలా’ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో అద్భుతంగా రూపుదిద్దుకున్న ఈ పాట పవన్ కళ్యాణ్ డ్యాన్స్ తో అభిమానులను అలరిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక కొత్త సంవత్సరం కానుకగా ఈ చిత్రం నుంచి పవన్‌కళ్యాణ్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో పవర్‌స్టార్ చేతిలో గన్ పట్టుకొని స్టైలిష్‌గా దర్శనమిచ్చాడు.

స్టైలిష్ లుక్‌లో పవర్‌స్టార్

పవన్‌కళ్యాణ్ తన కొత్త చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డితో చేయబోతున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మేకర్స్ కొత్త సంవత్సరం కానుకగా ప్రకటించారు. సురేందర్ రెడ్డికి మెగా హీరోలతో మంచి ట్రాక్ రికార్డు ఉంది. రేస్ గుర్రం, ధృవ, సైరా నరసింహా రెడ్డి లాంటి భారీ హిట్స్‌ను అతను అందించాడు. ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్‌తో పని చేసే ఛాన్స్ అందుకున్నాడు. ఇక ఈ సినిమాకి వక్కంతం వంశీ కథ అందిస్తుండగా రామ్ తాళ్లూరి నిర్మాణం వహిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments