
భూటాన్: ఢిల్లీ భారీ పేలుడు ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. ఢిల్లీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఢిల్లీ పేలుడు ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని అన్నారు. భూటాన్ లో ప్రపంచ శాంతి ప్రార్థనా ఉత్సవాల్లో మోడీ పాల్గొన్నారు. భూటాన్ కార్యక్రమంలో ఢిల్లీ పేలుడుపై మోడీ స్పందించారు. ఢిల్లీ ఘటనకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బుద్ధుడు ప్రపంచానికి శాంతి మార్గం చూపించారని, ఢిల్లీ పేలుడు ఘటనలో ఉగ్ర కుట్ర మూలాలను ఛేదిస్తామని సవాల్ విసిరారు. కుట్రదారులను వదిలిపెట్టమని, బాధ్యలను చట్టం ముందు నిలబెతామని తెలియజేశారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ఘటన తనని కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు దేశం అండగా ఉందని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు.




