
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల కేసు సంచలనం రేపింది. ఇప్పటికే పరువురు సెలబ్రిటీలను ఈ కేసు నేపథ్యంలో సిఐడి అధికారులు విచారించారు. అందులో సినిమా, క్రికెట్, సోషల్‌మీడియా సెలబ్రిటీలు ఉన్నారు. తాజాగా ఈ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్ సిఐడి విచారణకు హాజరుకానున్నారు. ఇప్పటికే వీరిని అధికారులు విచారించారు. ఇఫ్పుడు మరోసారి విచారణకు హాజరు కానున్నారు. గతంలో సినీ నటులు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయన్సర్‌లపై కేసులు నమోదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కేసుల నమోదుతో సిఐడి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.




