
డిగ్రీ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…. లాలాపేట సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసముంటున్న రిటైర్ట్ రైల్వే ఉద్యోగి ప్రమోద్‌కుమార్ పెద్ద కూతురు మౌలిక (19) అలియాస్ వెన్నల తార్నాకలోని రైల్వే డిగ్రీ కళాశాలలో బిఏ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. మౌలిక బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ద్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మాణికేశ్వర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి కొన్ని నెలల నుండి రైల్వే డిగ్రీ కాలేజీలో వాలీబాల్ కోచ్‌గా ఉంటూ మౌలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలి సెల్‌ఫోన్‌లో కూడా డేటా పూర్తిగా డిలీట్ చేసి ఉందని, డేటాను రిట్రీవ్ చేస్తున్నట్లు తెలిపారు. మౌలిక ఆత్మహత్య కేసులో అనుమానిస్తున్న వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.




