Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedభూభారతితో రైతుకు భద్రత

భూభారతితో రైతుకు భద్రత

మన తెలంగాణ/ఆమనగల్లు: రాష్ట్రంలో భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. స మీకృత భూభారతి పోర్టల్‌ను గురువారం 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టినట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం స మీకృత భూ భారతి కింద ఎంపికైందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో ని విఠాయిపల్లిలో కల్వకుర్తి  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్, జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డిలతో కలిసి సమీకృత భూ భారతి పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు.

అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందాలనే లక్షంతో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆధార్ నెంబర్ వలె భూమి కల్గిన ప్రతి రైతుకు సర్వే నెంబర్‌కు భూదార్ కేటాయిస్తామన్నారు. భూ భారతి చట్టంలో రిజిస్ట్రేషన్ జరిగే సమయంలోనే ఆ సర్వే నెంబర్‌కు సంబంధించిన సరిహద్దులుంటాయన్నారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్షంతో సీఎం రేవంత్ ఆలోచనల మేరకు ప్రభుత్వం రెవెన్యూ శాఖ సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. ఖమ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి మండలాల్లో ఈ పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేసినట్లు తెలిపారు. పైలెట్ ప్రాజెక్టులో వచ్చే ఫలితాల ఆధారంగా మార్పులు చేసి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు.

పాత సర్వే పరికరాలకు స్వస్తి చెప్పి ఆధునిక రోవర్ సాంకేతికతను వినియోగించి, వేగవంతమైన, కచ్చితమైన సర్వేలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించండి. కల్వకుర్తి నియోజకవర్గానికి మరో 3500ల ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇందుకుగాను మంత్రి సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి సుశిందర్‌రావు. డీఎంహెచ్‌ఓ లలితదేవి, డీఏఓ ఉష, ఆర్డీ జగదీశ్వర్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ యాట గీత నర్సింహా, మున్సిపల్ చైర్మన్ నేనావత్ పత్యనాయక్, కౌన్సిలర్ అనిత శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శంకర్‌నాయక్, తహశీల్దార్ మహ్మద్ ఫయూమ్ ఖాద్రీ, పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, బాలాజి సింగ్, భట్టు కిషన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments