Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedమూసీ ప్రాజెక్టుకు భారీ ఊరట

మూసీ ప్రాజెక్టుకు భారీ ఊరట

మనతెలంగాణ/హైదరాబాద్: మూసీనది పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. ఈ ప్రాజెక్టును సవాలు చేస్తూ బిఆర్‌ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేసింది. దీంతో మూసీ ప్రక్షాళన ప నులకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అ డ్డంకి తొలగిపోయినట్లయింది. అయితే, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రా జెక్టు వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని, నిబంధనలకు విరుద్ధంగా పను లు జరుగుతున్నాయని కార్తీక్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, రాజకీ య దురుద్ధేశ్యంతోనే కార్తీక్‌రెడ్డి పిటిషన్ వే శారని ప్రభుత్వం వాదించింది.

దీంతో పి టిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్ పిటిషన ర్ తన వాదనలకు సంబంధించి ఎటువం టి సరైన సాంకేతిక లేదా శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని పేర్కొంది. కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోలేమ ని, పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని ట్రిబ్యునల్ అభిప్రాపడుతూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. తాజాగా నేషల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనుల్లో వేగం పెంచనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మూ సీలో మురుగునీరు కలవకుండా ఎస్టీపి ల నిర్మాణం, నది పరీవాహక ప్రాంతాల్లో రి టైనింగ్ వాల్స్, చెక్‌డ్యామ్‌ల ఏర్పాటు వం టి పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments