Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedగ్రూప్-1 ఫలితాలపై జోక్యానికి సుప్రీం నో

గ్రూప్-1 ఫలితాలపై జోక్యానికి సుప్రీం నో

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీ వివాదానికి శుభం కార్డు పడింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం గ్రూప్1కు సంబంధించిన 563 పో స్టుల నియామకాలపై దాఖలయిన పిటిషన్లను గురువారం కొట్టేసింది. హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు విచారించడానికి మెరిట్స్ లేవని జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం పేర్కొంది. దీంతో గ్రూప్ 1 పోస్టుల నియామక వివాదానికి తెరపడినట్లయ్యింది. కాగా, గ్రూప్ 1 పోస్ట్‌ల భర్తీ కి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చే స్తూ పలువురు అభ్యర్థులు రాష్ట్ర హైకోర్టు ను ఆశ్రయించారు. నియామకాల్లో అవకతవలు జరిగాయిని, మూల్యాంకనంలో త ప్పులున్నాయని, నోటిఫికేషన్‌ను రద్దు చే యాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ల ను విచారించిన హైకోర్టు గ్రూప్ 1 నియామాల్లో అవతవకలు కనిపించడంలేదని పేర్కొంటూ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తుది తీర్పు వెలువరించింది.

ఈ తీర్పును పలువురు అభ్యర్థులు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. వాదనల సందర్భంగా హైకోర్టు తమ వాదనను పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్లు సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. ఈ దశలో టిజిపిఎస్‌సి తరపు న్యాయవాదులు జోక్యం చేసుకుని నియామక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పారు. అవకతవకల జరిగాయని చెప్తున్న అంశాలు అభ్యర్థుల అపోహలు మాత్రమేనని, మూడు సార్లు పరీక్షా పత్రాలు మూల్యాంకనం చేసినట్లు కోర్టుకు వివరించారు. దీంతో కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1కు చెందిన 563 పోస్ట్‌ల భర్తీని ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది. ఈ విషయంలో రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు నిర్ణయాన్ని పక్కనబెట్టడానికి తగిన ఆధారాలు పిటిషన్‌లో లేవని పేర్కొంది. హైకోర్టు ఇప్పటికే ఈ విషయాన్ని పరిశీలించి, తదుపరి ఆదేశాలను జారీ చేసిందని, అందులో తాము జోక్యం చేసుకోదలుచుకోలేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments