Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedబిఆర్‌ఎస్‌పై బురద జల్లేందుకు కాళేశ్వరంపై కట్టుకథలు

బిఆర్‌ఎస్‌పై బురద జల్లేందుకు కాళేశ్వరంపై కట్టుకథలు

మన తెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై సిఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలకు పెద్దగా తేడా లేదని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు అన్నారు. పార్లమెంట్‌లో కాళేశ్వరంపై సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ పా ర్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. బిఆర్‌ఎస్‌పై బురదజల్లేందుకు కాంగ్రెస్, బిజెపి పార్టీల ఫెవికాల్ బంధం బయటపడిందని ఆరోపించా రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వమే అ న్ని అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు. అ సెంబ్లీ మీడియా హాలులో మంగళవారం బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలతో కలిసి హరీష్‌రావు మీడియా తో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మం త్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్టు అని ప్రశంసించాయని అన్నారు. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కాళేశ్వరం వల్ల గత రెండేళ్లలో వేల

ఎకరాల సాగు భూమి విస్తీర్ణత పెరిగిందని నివేదిక పెట్టారని తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో గంధమల్ల ప్రాజెక్టుకు, ముసీలో తెచ్చే గో దావరి నీళ్లు కాళేశ్వరం నుండి వస్తున్నాయని తెలిపారు. సీఆర్ పాటిల్ తెలంగాణకు వచ్చి ఇ క్కడ రైతులను నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయ ని అడిగితే సమాధానం వస్తుందని అన్నారు. కేవలం బిఆర్‌ఎస్ పార్టీ మీద బురదజల్లడానికే కాళేశ్వరం గురించి తప్పుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం  చేశారు. మరో రూ.50 కోట్లు ఖర్చు చేస్తే మరో 2 లక్షల ఎకరాల ఆయకట్టు వస్తుందని తెలిపారు. రెండేళ్ల నుంచి దాదాపు 20 లేఖలు రాస్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం లేదని ఆరోపించారు. తమ మీద కోపం ఉంటే తీర్చుకోవచ్చు… కానీ ఆ కోపాన్ని రైతుల మీద చూపించవద్దని కోరారు. కెసిఆర్ ఆదేశాల మేరకు, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.

కేరళ ఎన్నికల కోసం శాసనసభను వాయిదా వేశారు

కేరళ ఎన్నికల కోసం శాసనసభను 30వ తేదీనే నిరవధిక వాయిదా వేశారని హరీష్‌రావు ఆరోపించారు. కేరళ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అవసరమేమో కానీ బిఆర్‌ఎస్‌కు ప్రజా సమస్యలు ముఖ్యమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, ప్రజా సమస్యలు ముఖ్యమా..లేక కేరళ ఎన్నికల ప్రచారం ముఖ్యమా..? అని ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలు ఒక దిశా నిర్దేశం లేకుండా ముగిశాయని పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీలపై స్పష్టత వస్తుందని, ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశించిన ప్రజలకు ప్రభుత్వం తీవ్ర నిరాశనే మిగిలించిందని అన్నారు. బడ్జెట్, బిల్లులు పాస్ చేసుకోవడానికి, రాజ్యాంగ అనివార్యతను పూర్తి చేయడానికి మాత్రమే తూతూ మంత్రంగా సభను నడిపారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో సహా సభలో బయటపెడితే..

ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలసీలను గాలికి వదిలేసి, పహిల్వాన్ల భాషను మాట్లాడారని హరీష్‌రావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో పాలసీలు ఉంటాయి కానీ పహిల్వాలు, కుస్తీ పోటీలు ఉండవని విమర్శించారు. అసెంబ్లీని కుస్తీల పోటీగా మార్చారని మండిపడ్డారు. కత్తులతో కోలాటంలో తలలు తీసేస్తామని మరో ఎంఎల్‌ఎ వ్యాఖ్యానించారని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని కోరారు. గడిచిన రెండున్నర సంవత్సరాలలో రేవంత్ రెడ్డి సభలో మాట్లాడిన ఎన్నో అనాగరిక వ్యాఖ్యలను ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తమ గొంతు నొక్కివేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం వైఫల్యాలను నిలదీస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments