Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedఇస్ఫహాన్‌పై బంకర్ బాంబులు

ఇస్ఫహాన్‌పై బంకర్ బాంబులు

దుబాయ్: ఇరాన్‌లోని ప్రధాన అణు కేంద్రాలు ఉ న్న నగరం ఇస్ఫహాన్‌పై అమెరికా మంగళవారం భారీ వైమానిక దాడులు జరిపింది. ఆయుధ నిల్వ లు ఉన్న ఓ డిపోపై రెండు వేల పౌండ్ల బంకర్ బస్టర్‌లతో దాడి చేసింది. ఈ దాడులతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దాడికి సంబంధించి న వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. అదే సమయంలో పెర్షియన్ గల్ఫ్‌లో పూర్తిగా చమురు లోడ్‌తో వెళ్తున్న కువైట్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. ఈ ఘటనలతో అమెరికా-ఇజ్రాయెల్ మొదటి దాడులు ప్రారంభమైన దాదాపు నెల తర్వాత కూ డా యుద్ధం తీవ్రత తగ్గలేదని స్పష్టంగా తెలుస్తోం ది. ఈ ఘర్షణల్లో ఇప్పటివరకు 3,000 మందికి పైగా మరణించగా, ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. అమెరికాలో గ్యాసోలిన్ ధర గ్యాలన్‌కు 4 డాలర్లను దాటడం కూడా ఈ యుద్ధ ప్రభావమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

చమురు మార్కెట్లలో కలకలం

పెర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ చమురులో ఐదవ వంతు రవాణా జరిగే హార్మూజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం, అలాగే ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరగడం వల్ల గ్లోబల్ చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 106 డాలర్ల వద్ద ఉండగా, యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 45 శాతం పెరుగుదల నమోదైంది.ఈ ప్రభావంతో ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలవడంతో పాటు, నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ త్వరలో ఆపకపోతే, హా ర్మూజ్ మార్గం తెరవకపోతే దాడులను మరింత విస్తరించనున్నట్లు హెచ్చరించారు.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్

సంయుక్త దాడులు

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై మరోసారి దాడులు ప్రారంభించాయి. రాజధాని తెహ్రాన్‌తో పాటు ఇస్ఫహాన్ ప్రాంతం లక్ష్యంగా భారీ దాడులు జరిగినట్లు సమాచారం. ఇస్ఫహాన్ ప్రాంతంలో భారీ స్థాయిలో యురేనియం నిల్వలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్‌లో జరిగిన 12 రోజుల యుద్ధంలో కూడా ఈ ప్రాంతం లక్ష్యంగా మారింది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం, శుద్ధి చేసిన అధిక యురేనియాన్ని ట్రక్కుల ద్వారా భూగర్భ సొరంగాల్లో నిల్వ చేసినట్లు సమాచారం.

ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ తీరానికి సమీపంలో కువైట్ ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. ఈ ఘటనలో ట్యాంకర్‌లో మంటలు చెలరేగినా, తరువాత అదుపులోకి తీసుకువచ్చారు. ఈ దాడిలో చమురు లీకేజీ జరగలేదని అధికారులు తెలిపారు. డ్రోన్ మిగులు భాగాలు నివాస ప్రాం తంలో పడటంతో నలుగురు గాయపడ్డారు. బహ్రెయిన్‌లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగగా, సౌదీ అరేబియా తన రాజధాని వైపు దూసుకొచ్చిన మూడు క్షిపణులను అడ్డుకుంది. ఇజ్రాయెల్‌లో కూడా భారీ పేలుళ్లు వినిపించాయి.

లెబనాన్‌లో శాంతి బలగాలు మృతి

ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య యుద్ధం కొనసాగుతున్న లెబనాన్‌లో, 24 గంటల్లో ముగ్గురు ఐక్యరాజ్యసమితి శాంతి బలగాలు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘ టనపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర స మావేశం నిర్వహించనుంది. ఇరాన్‌లో 1,900 మందికి పైగా మరణించగా, ఇజ్రాయెల్‌లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గల్ఫ్ దేశాలు, వెస్ట్ బ్యాంక్‌లో కూడా మరణాలు నమోదయ్యాయి. లెబనాన్‌లో 1,200 మందికి పై గా మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితు లు కొనసాగుతుండగా, ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్ర భావం చూపుతోంది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments