Saturday, April 18, 2026
Google search engine
HomeUncategorizedకల్యాణం కమనీయం

కల్యాణం కమనీయం

మన తెలంగాణ/ భద్రాచలం: భద్రాచలంలో శుక్రవారం శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణం వైభవోపేతంగా సాగింది. ఉదయం 9:45 గంటలకు వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ మొదలైన ఊరేగింపు మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపా నికి స్వామి వారు, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను 10.42 కి మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకొచ్చారు. ఈ సమయంలో స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, ఎదురుగా అమ్మవారిని ఆసీనులను చేశారు. అలాగే కళ్యాణం సందర్భంగా భక్తరామ దాసు చేయించిన నగలను వధూవరులకు ధరింపజే శారు. తొలుత వంశ గోత్రాలకు సంబందించి ప్రవరలు చదివారు. ఈ సమయంలో ఆశీర్వచనం, పాద ప్రక్షాళన, పష్పోదక స్నానం జరిపి వరపూజ నిర్వహించారు. కల్యాణం సందర్భంగా సంప్రదాయబద్ధంగా భక్తరామ దాసు చేయించిన నగలను వధూవరులకు ధరింపజే శారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున చైర్మన్ బీఆర్ నాయుడు, శృంగేరి శారదా పీఠం, చినజీయర్ స్వామి తరపున, భక్తరామదాసు వారసులు కంచర్ల శ్రీనివాసరావులు, తూము నరసింహదాసు వంశీ కులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిం చారు.

భద్రాద్రి రాముని కల్యాణ వైభవ ప్రాశస్త్యంతో పాటు భక్తరామదాసు చేయించిన ఆభరణాల విశిష్టతను దేవస్థా నం స్థానాచార్యులు కేఈ స్థలశాయి వివరించారు. అర్చక స్వా ములు మధుపర్కం ప్రాశసన ఆనం తరం తేనె, పెరుగు కలిపిన మిశ్రమాన్ని స్వామి వారికి నివేదించి నూతన వస్త్రాలంకరణ చేశా రు. లోక పర్యంతాన్ని, విశ్వసృష్టిని దానిలో ఉన్న కాలాన్ని, దేశా న్ని తెలుపుతూ సంకల్పం చెప్పి కన్యాదాన కరిష్యే అంటూ ముగించారు. ఈ సమయంలో కన్యావరణలు. కొబ్బరిబొండం, తాంబూ లం, దక్షిణ స్వామి వారికి సమర్పించారు. కన్యాదానంతో పాటు గోదానం, భూదాన కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వ హించారు. రామ భద్రుడికి, సీతామాతకు వేర్వేరుగా మంగళాష్టకం చదివారు. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని వివరిస్తూ ఉత్సవమూర్తుల శిరస్సుపై ఉంచారు. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎం రేవంత్‌రెడ్డి దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రా లు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం దశరధు డు, జనకమహారాజు తరపున, భక్తుల తరపున భక్తరామదాసు చే యించిన మూడు మంగ శసూత్రాలతో కూడినసూత్రధారణను క న్నుల పండువగా నిర్వహించారు.

ఆ తరువాత తలంబ్రాల ప్రాశ స్త్యం వివరిస్తూ తలంబాల కార్యక్రమం సంప్రదాయబ ద్ధంగా అర్చకస్వాములు నిర్వహించారు. చివరగా భాగవోత్తముల ఆశీర్వచనంతో కళ్యాణం ముగిసింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , కొండా సురేఖ , వాకాటి శ్రీహరి కుటుంబ సమేతంగా తిలకించారు. అలాగే ఎంపీ పోరిక బరాంనాయక్, వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, డాక్టర్ తెల్లం వెంకట్రావు, కో రం కనకయ్య, దుబ్బాక కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్, రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీవో రాల్, దేవస్థానం ఈవో కె.దామోదరావులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments