Sunday, April 19, 2026
Google search engine
HomeUncategorizedప్రజల ముంగిటకు ప్రజాపాలన

ప్రజల ముంగిటకు ప్రజాపాలన

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పలు సంస్కరణలను అమలు చేస్తూ ప్రజలకు మరింత చేరువైంది. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి డిజిటల్ ట్రాకింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు భూమి రికార్డుల ఆధునీకరణలో భాగంగా భూ భారతీ చట్టం-2025 అమలు చేసి ప్రతి భూభాగానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ప్రవేశపెట్టిందని సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక ప్రశంసించింది. డిజిటల్ సేవల్లో ముందంజలో నిలుస్తూ టి-వాలెట్ ద్వారా పౌర సేవలను విస్తరించిందని పేర్కొంది. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, టీ సేఫ్ సేవలను బలోపేతం చేసిందని పేర్కొంది. డ్రగ్స్ నియంత్రణలో కఠిన చర్యలు తీసుకుంటూ ఈగల్ (యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) అనేక కేసులు నమోదు చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత, బాధ్యతాయుత పాలనకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి లక్ష్యాలను ప్రజల ఆశయాలకు అనుగుణంగా అమలు చేస్తోందని కితాబు ఇచ్చింది.

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి, మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ఫిర్యాదులు స్వీకరించి, ప్రత్యే క డిజిటల్ పోర్టల్ ద్వారా ట్రాకింగ్ సౌకర్యం కల్పించిందని పేర్కొంది. భూమి రికార్డుల ఆధునీకరణలో భాగంగా తెలంగాణ భూ భారతీ చట్టం-2025 అమలులోకి తీసుకువచ్చి, ప్రతి భూభాగానికి ప్రత్యేక గు ర్తింపు సంఖ్య (భూధార్) ప్రవేశపెట్టిందని పేర్కొం ది. భూ వివాదాల పరిష్కారానికి డిజిటల్ పోర్టల్, ఏఐ ఆధారిత చాట్‌బాట్, ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఏర్పా టు చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ టి—వాలెట్ వినియోగం పెరిగి, 2025 డిసెంబర్ నాటికి రూ. 2,974 కోట్ల లావాదేవీలు నమోదు అయ్యాయని పే ర్కొంది. అలాగే మీ టికెట్ యాప్ ద్వారా డిజిటల్ టికెటింగ్, యుటిలిటీ చెల్లింపులు అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొంది. విద్యా రంగంలో టీ- శా ట్ ద్వారా కోట్లాది మంది విద్యార్థులకు శాటిలైట్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా శిక్షణ అందిస్తోంద ని, అలాగే ఈ ప్రభుత్వం 67,763 ఉద్యోగాలను భ ర్తీ చేసి పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేసిందిదని పేర్కొంది.

డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కఠిన చర్యలు తీసుకుని 2025లో వేల కేసులు నమోదు చేసి అనేక మందిని అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్ వాడకం, వాటి వల్ల కలిగే అనార్థలకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన కల్పిస్తోందని పేర్కొంది. డిజిటల్ సేవలలో రా ష్ట్రం ముందంజలో ఉండిదని, వాట్సప్ యాప్ ద్వా రా పౌర సేవలు అందిస్తున్న తొలి రాష్ట్రంగా నిలిచిందని ప్రశంసించింది. పిల్లల రక్షణ కోసం ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో తప్పిపోయిన పిల్లలను గుర్తించి కు టుంబాలకు అప్పగించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొంది. గ్రామీణ, పట్ట ణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా ని ర్వహించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని, ప్రజా పాలన కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే చర్యలు అమలు చేస్తోందని పేర్కొంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments