Sunday, April 19, 2026
Google search engine
HomeUncategorizedయుద్ధం.. మహోగ్రం

యుద్ధం.. మహోగ్రం

దుబాయ్/టెహ్రాన్: పశ్చిమ యుద్ధం అత్యంత భీకర రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఆయా దేశాల్లోని సైనిక, వైమానిక, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యక్తులనే లక్షంగా చేసుకున్న ఇరు పక్షాలు తాజాగా ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇజ్రాయె ల్ తన కీలక సహజ వాయు క్షేత్రంపై దాడి చేసిన నేపథ్యంలో, ఇరాన్ ప్రతీకార చర్యల ను మరింత ముమ్మరం చేసింది. గురువా రం గల్ఫ్ ప్రాంతంలోని పలు ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జ రిపింది. సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్ర తీరంలోని రిఫైనరీపై దాడి చేయగా ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ కేంద్రాల్లో, కువైట్‌లోని రెం డు చమురు శుద్ధి కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ పరిణామాలు మ ధ్యప్రాచ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చే శాయి.

గురువారం నాడు ఖతార్ రాజధాని దోహాకు దగ్గర్లోని రస్ లఫాన్‌లో ఉన్న అత్యంత భారీ గ్యాస్ చమురు క్షేత్రంపై దాడి చేసింది. ఇక్కడి నుంచే ఆసియా, ఐరోపా ఖండాలకు భారీ మొత్తంలో ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయు క్షేత్రంగా భావించే సౌత్ పార్స్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇరాన్ దాడులకు దారి తీసింది. ఇరాన్ విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 80 శాతం దీనిపైనే ఆధారపడటం వల్ల, ఈ దాడి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కువైట్‌లోని మీనా అల్- అహ్మది రిఫైనరీపై డ్రోన్ దాడితో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా, సమీపంలోని మీనా అబ్దుల్లా రిఫైనరీ కూడా మంటల్లో చిక్కుకుంది. సౌదీలోని అరామ్ కో రిఫైనరీపై కూడా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరానికి సమీపంలో ఒక నౌక అగ్నికి ఆహుతి అయ్యింది.

ఖతార్ సమీపంలో మరో నౌక దెబ్బతింది. హార్ముజ్ మార్గాన్ని తప్పించేందుకు సౌదీ అరేబియా ఎర్ర సముద్ర మార్గం ద్వారా చమురు సరఫరాను పెంచుతుండగా యన్బూ నగరంలోని సమ్రెఫ్ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో ఆ రహదారి భద్రత ప్రశ్నార్ధకమైంది. అబూదాబిలోని హబ్షాన్ గ్యాస్ సదుపాయం, బాబ్ ఆయిల్ ఫీల్డ్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇరాన్ దాడులను అధికారులు ప్రమాదకర ఉద్రిక్తత పెరుగుదలగా అభివర్ణించారు. ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ దేశాలు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి. సౌదీ విదేశాంగ మంత్రి ఇప్పుడు ఉన్న కొద్దిపాటి నమ్మకమూ పోయింది అని వ్యాఖ్యానించారు. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలపై కూడా ఇరాన్ దాడులు చేసింది. ఇజ్రాయెల్‌లో పలు ప్రాంతాల్లో ఇరాన్ క్షిపణి దాడులు కొనసాగడంతో లక్షలాది ప్రజలు బంకర్లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. వెస్ట్‌బ్యాంక్‌లో జరిగిన దాడిలో నలుగురు పౌరులు మృత్యువాతపడ్డారు. కొన్ని భవనాలకు నష్టం కలిగినప్పటికీ, పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరగలేదు. ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 20కిపైగా నౌకలపై దాడులు జరిగినట్లు సమాచారం. హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా తీవ్రంగా తగ్గిపోయింది.

ఇరాన్‌లో ముగ్గురికి మరణశిక్ష

జనవరిలో జరిగిన నిరసనల సమయంలో అరెస్టైన ముగ్గురికి ఇరాన్ మరణదండన విధించి అమలు చేసింది. మానవ హక్కుల సంఘాలు దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా ఈ యుద్ధంలో ఇప్పటివరకు ఇరాన్‌లో 1,300 మందికి పైగా మరణించగా, లెబనాన్‌లో సుమారు 968 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్‌లో 15 మంది మృతి చెందారు. అమెరికా సైనికుల్లో కనీసం 13 మంది మరణించినట్లు సమాచారం.

చమురు ధరలపై ప్రభావం

ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ చమురు ధర బ్యారెల్‌కు 114 డాలర్లకు చేరింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్‌పై దాడులు ప్రారంభించినప్పటి నుంచి చమురు ధరలు దాదాపు 57 శాతం పెరిగాయి. మరోవైపు హర్మూజ్ నుంచి తమ అనుమతితో వెళ్తున్న పలు దేశాల నౌకలపై టోల్ విధించాలని ఇరాన్ భావిస్తోంది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్న ఇరాన్ చట్ట సభ్యుడొకరు వెల్లడించారు. తదునుగుంణగా బిల్లులు తీసుకురానున్నట్టు తెలిపారు. కాగా ఇప్పటి వరకు ఇజ్రాయెల్, అమెరికా నౌకలపై హర్మూజ్‌ను జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments