Thursday, March 5, 2026
Google search engine
HomeUncategorizedఇవేం బదిలీలు?

ఇవేం బదిలీలు?

మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో ఐఏఎస్, ఐపిఎస్‌లను మార్చడం వల్ల పాలనలో ఫలితాలు రావని ఎమ్మెల్యే, బిఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నాయకుడు టి.హరీశ్ రావు విమర్శించారు. సిఎం రేవంత్‌రెడ్డికి పరిపాలన రావడం లేదన్నారు. బుధవారం హై దరాబాద్‌లో మీడియాతో హరీశ్ రావు చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అధికారులను పదే ప దే మారుస్తున్నారని, ఇప్పటి వరకు ఐదుసార్లు భా రీగా మార్పులు, చేర్పులు జరిగాయన్నారు. విభా గాధిపతులు సగటున ఎనిమిది నెలలు కూడా పని చేయడం లేదని విద్యుత్ శాఖలో ఈ రెండేళ్ల కాలం లో ఐదుగురు అధికారులు మారారని ఆయన వి మర్శించారు. ఈ బదిలీలతో విద్యుత్ శాఖ అతలా కుతలం, అవినీతి మయం అయ్యిందన్నారు. రెం డేళ్ల పాలనలో రంగారెడ్డి జిల్లాలో నలుగురు కలెక్ట ర్లు మారారని, ఢిల్లీతో సమన్వయం ఉండాల్సిన కీలక శాఖల్లో అధికారులను తరచూ మార్చడం వ ల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లుతోందని ఆయన తెలి పారు. అధికారులను ఇలా తరచూ మారిస్తే పాల న ఎలా నడుస్తుందని, ఇదంతా ఓ జోక్‌గా మారి పోయిందని ఆయన విమర్శించారు. కలెక్టర్‌కు జి ల్లాపై అవగాహన రావడానికే 

ఆరునెలల సమయం పడుతుందని, అలాంటిది ఆరునెలల్లోనే మారిన కలెక్టర్లు ఎంతో మంది ఉన్నారని హరీష్‌రావు విమర్శించారు. నిత్యం బదిలీల వల్ల యువ కలెక్టర్లలో నైతిక స్థైర్యం దెబ్బతింటోందని, వాళ్లకు నచ్చిన వాళ్లకు మంచి పోస్టింగ్‌లు, నచ్చని వారిని బదిలీలు చేస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. సిఎం, మంత్రులకు నచ్చకపోతే అధికారులకు బదిలీలు తప్పడం లేదన్నారు. పదవీ విరమణ చేసిన అధికారులకు సర్వీస్ పొడిగింపు సాధారణం అయిపోయిందన్నారు. డజన్ మంది ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు ఎక్స్ టెన్షన్ ఇచ్చారని, వందల మంది ఇంజనీర్లకు పదవీ కాలాన్ని పెంచుతూ పోతున్నారని ఆయన ఆరోపించారు. బిఆర్‌ఎస్ హయాంలో అధికారుల పదవీ కాలం పొడగింపుపై అప్పట్లె కాంగ్రెస్ నేతలు విమర్శలు చేశారని ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు.

యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్ల అవినీతిని….

యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణ టెండర్లను ఐదు శాతం ఎక్కువకు ఇస్తున్నారని, వాటి వివరాలు త్వరలో బయట పెడతానని హరీశ్ రావు ఆరోపించారు. ఇంజనీరింగ్ శాఖలో రిటైర్డ్ అధికారులు కీలక పదవుల్లో ఉండటం వల్ల అవినీతి ఎక్కువ జరుగుతోందని ఆయన అన్నారు. అధికారులను తరచూ బదిలీ చేయడం వల్ల రాష్ట్రానికి అవార్డులు కూడా రావడం లేదని గతంలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. కలెక్టర్లకు కనీసం రెండేళ్లు ఒకే చోట ఉంటే ఫలితాలు వస్తాయని కెసిఆర్ హయాంలో రాష్ట్రం మోడల్ స్టేట్ అయ్యిదంటే దానికి అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లేనని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కలెక్టర్లను బెదిరించడం మంచి పద్ధతి కాదని, తమ అక్రమాలకు అధికారులు సహకరించడం లేనందుకే సిఎం వారిని బెదిరిస్తూ బదిలీ చేస్తున్నారని హరీష్‌రావుఆరోపించారు. అధికారులను సిఎం బ్లాక్ మెయిల్ చేయడం మానుకోవాలని హరీష్‌రావు హితవు పలికారు.

వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, జడ్చర్ల ఆస్పత్రిలో కుక్కలు…

వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ లగచర్ల ఆందోళన సందర్భంగా అనేక హామీలు ఇచ్చారని, ఆ హామీలు అమలు చేయాల్సి వస్తుందని ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేశారని హరీష్‌రావు ఆరోపించారు. ఐటీ కార్యదర్శిగా సిఎస్ ఎలా పని చేయగలుతారిన, సిఎస్‌కు చాలా బాధ్యతలు ఉంటాయని, అదనంగా ఐటీ కార్యదర్శిగా ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తారని హరీష్‌రావు ప్రశ్నించారు. 20 శాతం జీఓలు ఆన్‌లైన్‌లో ఉంచుతూ 80 శాతం ఆఫ్ లైన్‌లో ఉంచుతున్నారని ఆయన ఆరోపించారు. కోర్టు ఆదేశించినా జీఓలు ఆన్‌లైన్‌లో పెట్టడం లేదని ఆయన విమర్శించారు. తమ సలహాలను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తే మంచిదని లేదంటే వారి ఖర్మ ఆయన అన్నారు. వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు, జడ్చర్ల ఆస్పత్రిలో కుక్కలు రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఇలా తయారైందని ఆయన విమర్శించారు.

అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టు….

ఫిరాయింపుల విషయంలో కౌన్సిలర్లకు ఓ నీతి? ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరో నీతా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఫిరాయింపుల అంశం అంతా జోక్‌గా మారిపోయిందని అసెంబ్లీ వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆయన విమర్శించారు. అసెంబ్లీ అసెంబ్లీ మాదిరిగా లేదని హౌజ్ కమిటీలు వేయడం లేదని, డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయడం లేదని, చీఫ్ విప్ పదవి ఖాళీగా ఉందని, ఇలా ఎప్పుడు జరగలేదని, అసెంబ్లీ లైబ్రరీ కూడా సరిగా లేదని హరీష్‌రావు విమర్శించారు.

రాజేంద్రనగర్‌లో మైనింగ్ దందా

రేవంత్ రెడ్డి మేనల్లుడి మనుషులు నియో పొలీస్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని, మొబైల్ క్రషింగ్ ప్లాంట్‌కు మాత్రమే నిబంధనలుండగా ఫికస్డ్ క్రషింగ్ ప్లాంట్ నియోపోలిస్‌లో పెట్టారని హరీష్‌రావు ఆరోపించారు. ల్యాండ్ లీజుకు ఇస్తే 6 నుంచి 7 శాతం ఫీజు కట్టాలని, లెటర్లో పది ఎకరాలు ఇస్తే 15 ఎకరాల్లో మైనింగ్ జరుగుతోందని ఆయన ఆరోపించారు. 15 లక్షల క్యూబిక్ మీటర్ల బండకు ఫీజు ఎగ్గొట్టారని అక్కడ రెడీమిక్స్‌కు అనుమతి లేదని ఆయన అన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యేకు, మైనింగ్ కంపెనీకి పెనాల్టీ వేశారని, ఓఆర్‌ఆర్‌కు కిలోమీటర్ దూరంలో ఎలాంటి కంపెనీ, మైనింగ్ పెట్టవద్దని జీఓ ఉందన్నారు. మంత్రి పొంగులేటి సంస్థ రాఘవ కన్‌స్ట్రక్షన్ ఎలాంటి అనుమతులు లేకుండా రాజేంద్రనగర్‌లో మైనింగ్ దందా నడుపుతుందని ఆయన ఆరోపించారు. నేడు నిజానిర్ధారణ కోసం బిఆర్‌ఎస్ బృందం అక్కడకు వెళ్తుందన్నారు.

రాజ్యసభ పోటీపై వేచిచూద్దాం…

రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై సస్పెన్స్ ఉండనివ్వండి రేపటి వరకు వేచి చూద్దామని హరీష్‌రావు తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు హెల్త్ కార్డు జీఓ ఇచ్చానని, జర్నలిస్టులకు పెట్టిన రూ.16 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తే ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఎడ్యుకేషన్ పాలసీ బాగుంటే వెబ్ సైట్ నుంచి ఎందుకు తీసివేశారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ఇద్దరు సెక్రటరీల సిస్టం ఎప్పుడూ లేదన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments