Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedఅధికారం ఉందని అహంకారం వద్దు

అధికారం ఉందని అహంకారం వద్దు

మన తెలంగాణ/హైదరాబాద్/వికారాబాద్: “అహంకారాన్ని పక్కన పెట్టండి&ఏమీ ఆశించకుండా పార్టీ కోసం కష్టపడి పని చేయండి..పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి” అని ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీ తెలుగు రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షులకు హిత వు చెప్పారు. వికారాబాద్, అనంతగిరిలోని హరిత రిసార్ట్‌లో గత తొమ్మిది రోజులుగా శిక్షణా తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పదవ రోజు (సోమవారం) శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి రాహుల్ గాం ధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రా హుల్ గాంధీ మార్షల్ ఆర్ట్ ద్వారా పాఠాలు చెబుతూ డిసిసి అధ్యక్షులను ఉర్రూతలూగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, టి.పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేష్‌కుమార్ గౌడ్, ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తదితర అతిథులను ఆకర్షించారు.

రాహుల్ గాంధీ తన ప్రసంగంలో డిసిసి అధ్యక్షులకు ది శా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరు కష్టపడి పని చెయాలని, ప్రతి ఒక్కరూ మరో పది మంది నాయకులను తయారు చేయాలని, ఆ పది మంది పది మందిని తయారు చేయాలని, ఇలా నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉండాలని ఆయన సూచించారు. మార్షల్ ఆర్ట్ ద్వారా పలు మెళుకవలు చూపిస్తూ, ఇది ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం అ మలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళే బాధ్యత మీదేనని ఆయన డిసిసి అధ్యక్షులనుద్ధేశించి అన్నారు. నాయకత్వ సామర్థ్యాల అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు ప్రజలతో అనుసంధానం పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల వ్యూహరచన వంటి అంశాలపై సమగ్రంగా చ ర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన డిసిసి అధ్యక్షులు త మ జిల్లాల రాజకీయ పరిస్థితులు, బూత్ స్థాయి నిర్మా ణం, ప్రజా సమస్యలపై పార్టీ స్పందన తదితర అంశాలను విశ్లేషిస్తూ అనుభవాలను పంచుకున్నారు. ఈ సందర్భంలో సిద్దిపేట డిసిసి ఆంక్షా రెడ్డి మాట్లాడుతూ తాము కెసిఆర్‌పై పోరాటం చేస్తున్నామని చెప్పడంతో, రాహుల్ గాంధీ కల్పించుకుని మంచిదే పోరాటం చెయ్యండి.. హార్డ్ వర్క్ చేయండి అని సూచించారు.

మహాత్ముని ఒంటిపై&

జాతిపిత మహాత్మా గాంధీ ఒంటిపై ఒక బట్ట తప్ప ఏమీ ఉండేది కాదని, అది మహాత్ముని సాధారణ, నిరాండంబర జీవితానికి నిదర్శనమని ఆయన వివరించారు. బ్రిటిష్ వాళ్ళు గాంధీని ఏమీ చేయలేక దిగివచ్చారని ఆయన ఉదహరించారు. మీరూ అదే విధంగా అహం పక్కన పెట్టి సాధారణ, నిరాండంబరంగా ఉంటూ పార్టీ కోసం కష్టపడి పని చేస్తే అధికారం మీ చెంతకు వస్తుందని ఆయన తెలిపారు. ప్రజలతో మమేకం కావాలని ఆయన సూచించారు.

మంచి రోజులు రానున్నాయి

జిల్లాలకు డిసిసి అధ్యక్షులే పవర్‌ఫుల్ అని, సుప్రీం అని ఆయన అన్నారు. “మీరంతా నా టీం&మంచి రోజులు రానున్నాయి..” అని ఆయన తెలిపారు.

ఇదిలాఉండగా రాహుల్ గాంధీ తన ప్రసంగంలో దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌కి చైనా మద్దతునిస్తున్నదని, ఇరాన్ వెనక చైనా, రష్యా ఉందని ఆయన విమర్శించారు.

ప్రధాని మోడీపై నిప్పులు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా సరెండర్ అయ్యారని, ట్రంప్ కి వ్యతిరేకంగా మోదీ పని చేయలేరని ఆయన విమర్శించారు. హింస ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే బిజెపి లక్షమైతే, అహింసా మార్గాన్ని అనుసరిస్తూ, ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ పరమావధి అని రాహుల్ అనగానే కరతాళధ్వనులు మిన్నుముట్టాయి.

ముగిసిన శిక్షణా శిబిరం

వికారాబాద్ హరిత రిసార్ట్‌లో సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం భాగంగా నిర్వహించిన డిసిసి అధ్యక్షుల పది రోజుల శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది.

రాహుల్ గాంధీకి ఘన స్వాగతం

అనంతగిరిలో ఏర్పాటైన శిక్షణ శిబిరానికి విచ్చేసిన కాం గ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీకి ఎస్‌ఎపి కాలేజిలోని హెలిప్యాడ్ వద్ద నాయకులు ఘన స్వాగతం ఫలికారు. రాహుల్ గాంధీ వెంట రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. వారికి వికారాబాద్ నియోజకవర్గం ఎమ్మె ల్యే, అసెంబభ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఇంచార్జి మీనాక్షి నటరాజన్, టి.పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ఏపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, ఏఐసిసి సెక్రటరీ సచిన్‌సావంత్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఉదయం ఏయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుంచి శం షాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు హెలికాప్టర్‌లో వికారాబాద్‌లో జరుగుతున్న శిక్షణా శిబిరానికి చేరుకున్నారు. శిబిరం ముగిసిన అనంతరం రాహులు గాంధీ హెలికాప్టర్‌లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా, అక్కడి నుంచి ఆయన ఏయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్ళారు.

‘సంఘటన సృజన్’ ప్రోగ్రామ్ చైర్మన్ సచిన్‌రావ్

‘సంఘటన సృజన్ ప్రోగ్రామ్ చైర్మన్ సచిన్‌రావ్ ఆధ్వర్యంలో, ఆర్గనైజింగ్ సెక్రటరీ వంశీ చందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పరిగి రాంమోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ శిబిరం జరిగింది. వివిధ రంగాల నిపుణులు నాయకత్వ నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, సోషల్ మీడియా, మీడియా నిర్వహణ, ఎన్నికల వ్యూహరచన, కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన వంటి అంశాలపై శిక్షణనిచ్చారు.

మీడియాకు అనుమతి లేదు

సాధారణంగా ఏ పార్టీ అయినా తమ కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని భావిస్తాయి. కానీ కాంగ్రెస్ శిక్షణా శిబిరానికి మీడియాను దూరం పెట్టడం విశేషం. పది రోజుల పాటు శిక్షణా శిబిరం గోప్యంగా ఉంచారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments