
కోల్ కతా: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విండీస్ పై భారత్ గెలిచి సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. వెస్టిండీస్ పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. భారత జట్టు 19.2 ఓటర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. సంజూ శామ్సన్ భారీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 195 పరుగులు చేసింది. సంజూ 50 బంతుల్లో 97 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 11 బంతుల్లో పది పరుగులు చేసి అకిల్ హోస్సేన్ బౌలింగ్ లో హెట్మేయర్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ఇషాన్ కిషన్ ఆరు బంతుల్లో పది పరుగులు చేసి జోషన్ హోల్డర్ బౌలింగ్ లో హెట్ మేయర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. తిలక్ వర్మ 15 బంతుల్లో 27 పరుగులు చేసి మైదానం వీడాడు. హార్ధిక్ పాండ్యా 14 బంతుల్లో 17 పరుగులు చేసి ఔటయ్యాడు. శివమ్ దూబే నాలుగు బంతుల్లో 8 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జోషప్, హోల్డర్ చెరో రెండు వికెట్లు తీయగా అకీల్ హోసేన్ ఒక వికెట్ తీశాడు. 97 పరుగులు చేసిన సంజూ శామ్సన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.




