Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedతిరగబడ్డ ఇరాన్

తిరగబడ్డ ఇరాన్

 ఖమేనీ మరణం తర్వాత ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై

విరుచుకుపడ్డ ఇరాన్ 27 ప్రతీకార దాడులు

ఇజ్రాయెల్‌పై దాడిలో 8 మృతి అమెరికాకు చెందిన

అబ్రహం లింకన్ నౌకపై క్షిపణి దాడి దుబాయ్, అబుదాభి,

దోహా, మనామాలపై దాడులు హార్ముజ్ జలసంధి మార్గంలో

ఆయిల్ ట్యాంకర్లపై దాడి.. 15 మంది భారతీయులు సురక్షితం

దుబాయ్‌లోని పారిశ్రామిక నగరం షార్జాసిటీలో ఇరాన్ వైమానికి దాడి తర్వాత దృశ్యం

దుబాయ్ : తమ ప్రతీకార చర్యల ఉధృతితో ఆదివారం ఇరాన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ఓ వైపు ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలపై శక్తివంతమైన క్షిపణులతో దాడులకు దిగుతున్నాయి. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరిట సైనిక చర్యను ఇరాన్ చేపట్టింది. ఇప్పటివరకూ ఓ ఎత్తు అయితే ఇకపై జరిగేది మరో ఎత్తు అని, తమ దాడులతో ఇక ఇజ్రాయెల్, అమెరికాలు వదలిపెట్టండని వేడుకునే పరిస్థితి వస్తుందని తెలిపారు. తమ బలగాలు ఆదివారం మధ్య ప్రాచ్యంలోని 27 అమెరికా సైని క స్థావరాలపై దాడికి దిగాయని, భారీ నష్టం వాటిల్లిందని ఇరాన్ రెవెల్యూషనరీ గార్డు వర్గాలు టెహరాన్‌లో తెలిపాయి. ఇజ్రాయెల్‌లోని టెల్‌నోప్ ఎయిర్ బేస్, ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాల యం హాకీర్యా పై కూడా దాడికి దిగినట్లు వెల్లడించారు.ఆదివారం ఇజ్రాయెల్‌లోని బెయిట్ షెమెష్ పట్టణంపై మిస్సైల్ దాడిలో కనీసం ఎనమండుగురు చనిపోయినట్లు. 17 మందికి పైగా గాయపడ్డట్లు ఇరాన్ తెలిపింది. పలువురు ఆసుపత్రి పాలయ్యారు. దీనిని ఆ ప్రాంత వైద్యాధికారులు కూడా ధృవీకరించారు.

అమెరికాకు చెందిన యుద్ధ విమా న వాహక నౌక లింకన్‌పై దాడికి దిగాయి. యుఎస్‌ఎస్ లింకన్ ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ ఇరాన్ తీర ప్రాంతంలో మకాం వేసుకుని ఉన్నప్పుడు ఇరాన్ దాడికి గురైంది. మరో వైపు ఇరాన్ సేనలు దుబా య్, అబూధాబి, దోహా, మనామాలపై దాడులకు దిగాయి.ఖతార్ రాజధాని దోహా ఎక్కువగా ఇరాన్ దాడులకు తల్లడిల్లుతోంది. ఇక్కడి అమెరికా సైనిక స్థావరాలను ఎంచుకుని ఆదివారం మధ్యాహ్నానికి 11 సార్లు దాడులు జరిగాయి. కీలకమైన అంతర్జాతీయ విమాన ప్రయాణ కేంద్రం అయిన ఖతార్‌లో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటి దాడులతో దుబాయ్ వాసులు, ప్రత్యేకించి పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 8 గంటల ప్రాంతం లో వరుస పేలుళ్లు సంభవించాయి. ప్రఖ్యాత ప ర్యాదం బూర్జు ఖలీఫా సమీపంలోని పలు అంతస్తుల భవనాలపై దాడులు జరిగాయి. అక్కడి ఓ హోటల్ ఇరాన్ క్షిపణి దాడులతో పాక్షికంగా దెబ్బతింది.

అక్కడ మకాం వేసుకుని ఉన్న పర్యాటకులు భయంతో బయటకు పరుగులు తీయాల్సి వచ్చిం ది. శనివారం మధ్యాహ్నం నుంచే దుబాయ్‌లోని పలు ప్రాంతాలను ఎంచుకుని దాడులు సాగుతున్నాయి. గంటల విరామంతో పేలుళ్లు విన్పిస్తూ వచ్చాయని భారత్‌కు చెందిన ఓ ఐటి నిపుణుడు ఆర్ చౌదరి దుబాయ్ నుంచి ఫోన్‌లో తెలిపాడు. ఖమేనీ అంతంతో ఇరాన్ దాడులు భీకర స్థాయికి చేరిన విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వశాఖ నిర్థారించింది. ఆదివారం ఇరాన్ శక్తివంతమైన రెండు ఖండాంతర క్షిపణులతో విరుచుకుపడింది. క్షిపణులు సైప్రస్ దిశలో దూసుకువెళ్లాయి. అయి తే సైప్రస్‌ను లక్షంగా ఎంచుకుని దాడులు జరగలేదని బ్రిటన్ వర్గాలు తెలిపాయి.

రెడ్‌లైన్ దాటినందుకు తగు శిక్ష: ఇరాన్

ఇరాన్ ఆదివారం ఓ ప్రకటన వెలువరించింది. రెవెల్యూషనరీ గార్డు రంగంలోకి దిగింది. అమెరికా, ఇజ్రాయెల్‌లు రెడ్‌లైన్ దాటాయని , పాల్పడ్డ నేరానికి ప్రతిఫలం అనుభవించకతప్పదని ఇరాన్ పార్లమెంట్ ప్రతినిధి మెహమ్మద్ బఘెర్ ఖాలిబప్ టీవీలో ప్రసంగిస్తూ తెలిపారు. ఆదివారం తమ దాడులు తీవ్రస్థాయిలో ఉంటాయని ప్రకటించారు. చావుదెబ్బతీస్తామని హెచ్చరించారు.

హర్మూజ్ జలసంధి మార్గంలో దాడులు

15 మంది భారతీయ నౌకా సిబ్బంది సురక్షితం

మరో వైపు ప్రపంచ చమురు రవాణాకు అత్యవసరం అయిన హర్మూజ్ జలసంధి మార్గంలో ఒమన్ వద్ద ఇరాన్ మద్దతు గల హౌతి సాయుధులు ఓ ఆయిల్ ట్యాంకర్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారు. మొత్తం 20 మంది సిబ్బందిలో 15 మంది భారత జాతీయులు ఉన్నట్లు వెల్లడైంది. వీరిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఖతార్‌లో అమెరికా

వైమానిక స్థావరం ధ్వంసం

కమ్యూనికేషన్ వ్యవస్థకు ఇరాన్ విఘాతం

దోహా ః ఆదివారం ఇరాన్ జరిపిన దాడులలో ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరం దెబ్బతింది. యుఎస్ కమ్యూనికేషన్స్ కోసం వినియోగించే డోమ్ ధ్వంసం అయిందని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ కూడా నిర్థారించింది. ఇరాన్ ప్రతీకార దాడుల ప్రభావం ఎక్కువగా దోహాపై పడుతోంది. ఈ ప్రాంతంలో అమెరికా సమాచార వినిమయానికి అవసరం అయిన వ్యవస్థ విచ్ఛిన్నం అయినట్లు వెల్లడైంది. డోమ్‌పై దాడి జరిగిన విషయాన్ని పెంటగాన్ అధికార ప్రతినిధి సియాన్ పర్నేల్ ధృవీకరించారు. అయితే ఖతార్ అధికారికంగా ఈ విషయంపై ఎటువంటి స్పందనా వెలువరించలేదు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments