Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedఖమేనీ హత్య మహాపాపం

ఖమేనీ హత్య మహాపాపం

 నైతిక విలువలు, అంతర్జాతీయ

చట్టాల ఉల్లంఘనే ఇరాన్‌పై

వెంటనే అమెరికా, ఇజ్రాయెల్

దాడులు ఆపాలి: పుతిన్

ఖమేనీ హత్య ఇరాన్

సార్వభౌమాధికారంపై దాడే

దాడులను తప్పుపట్టిన చైనా

 అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే

రష్యా అధినేత పుతిన్ ఖండన

మాస్కో : ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీని చంపివేయడం దారుణ ఘటన అని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ ఖండించారు. ఈ మేరకు ఆయన తరఫున ఆదివారం ప్రకటన వెలువడింది. సంకుచిత రీతిలో జరిగిన మానవీయ నైతికత ఉల్లంఘన, అంతర్జాతీయ చట్టాలకు విఘాతం అని పుతిన్ తీవ్రంగా స్పందించారు. తమ ప్రకటనను ఆయన ఇరాన్ అధ్యక్షుడికి పంపించారు. శనివారం అర్థరాత్రి తరువాత ఇరాన్‌లో జరిగిన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక చర్యలలో ఖమేనీ కుటుంబం అంతం అయింది. ఇరాన్ రిపబ్లిక్ అధినేత హత్యాకాండ పట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నానని, దీనిని స్వీకరించాలని తెలిపారు. పుతిన్ ప్రకటన అధికారిక క్రెమ్లిన్ పోర్టల్‌లో పొందుపర్చారు. శనివారమే పుతిన్ తమ దేశ జాతీయ భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

ఖమేనీ హత్య చట్టాల ఉల్లంఘనే : చైనా

ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీని అంతమొందించడంపై చైనా ఖండన వెలువరించింది. ఇరాన్ సుప్రీం నాయకుడిని దారుణ రీతిలో తుదముట్టించడం ఇరాన్ సార్వభౌమాధికారం , భద్రతల నిబంధనల ఉల్లంఘన పరిధికి వస్తుందని చైనా తమ ప్రకటనలో తెలిపింది. ఐరాస నియమావళికి, అంతర్జాతీయ కట్టుబాట్లను దా రుణంగా ఉల్లంఘించారని విమర్శించారు. అంతర్జాతీ య సంబంధాలలో ఇది అత్యంత దారుణ ఘట్టం అని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో తక్షణమే సైనిక చర్యల నిలిపివేత అవసరం అని చైనా డిమాండ్ చేసింది. ప్రపం చం తల్లడిల్లే పరిస్థితిని రాకుండా చేయాలని తెలిపారు. ఇక చైనా, రష్యా విదేశాంగ మంత్రులు వాంగ్ యీ, సెర్గీ లావ్రోవ్ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇరాన్‌పై దాడులు, పరస్పర దాడుల పరిస్థితిపై ఆదివారం సమీక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments