Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedకరాచీలో హింస

కరాచీలో హింస

ఇరాన్ సుప్రీం లీడర్ హత్యపై

పెల్లుబికిన ఆగ్రహం అమెరికా

కాన్సులేట్‌పై నిరసనకారులదాడి

పోలీసుల కాల్పులు, 10 మంది మృతి

30మందికి గాయాలు, క్షతగాత్రుల్లో

పోలీసులు

కరాచీ: ఇరాన్‌లో మెరుపుదాడి చేసి ఇరాన్ సు ప్రీంలీడర్ ఖమేనిని హతమార్చడంపై ఆగ్రహించిన నిరసన కారులు ఆదివారంనాడు కరాచీ లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేసి, విధ్వసం సృష్టించారు. కర్రలతో విరుచుకు పడి అద్దాలు ధ్వంసం చేసి నిప్పుపెట్టేందుకు యత్నించారు. వారిని ఘర్షణ నివారించేందుకు ఒకదశలో పోలీసులు కాల్పులు జరపాల్సివచ్చిం ది. ఘర్షణ నేపథ్యంలో జరిగిన కాల్పులలో పదిమంది చనిపోయారు. శనివారంనాడు అమెరికా- ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై పెద్దఎత్తున జరిపిన వైమానిక దాడిలో సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ హత్యానంతరం ఈ ఘర్షణలు జరిగాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ మరణవార్త విన్నతర్వాత పెద్దఎత్తున నిరసనకారులు కాన్సలేట్ వద్ద గుమికూడారు. వారిని నివారించేందుకు పెద్దఎత్తున లాఠీచార్జీ చేసినా, బాష్పవాయువు ప్రయోగించినా ఫలితం లేకపోవడంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పుల్లో 10 మంది చనిపోయారు. 30 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురు పోలీసులు కూడా ఉన్నారని సింధ్‌లోని పోలీస్ సర్జన్ డాక్టర్ సుమై యా సయ్యద్ తెలిపారు. ఆస్పత్రికి 10 మృతదేహాలను తీసుకువచ్చారని ఆయన తెలిపారు.చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవడాన్ని సహించబోమని సింద్ అంతర్గత వ్యవహారాల శాఖమంత్రి జియావుల్ హసన లాగర్ అన్నారు. కాన్సులేట్ పై జరిగిన దాడికి సంబంధించి తక్షణం వివరాలు అం దించాలని కరాచీ అదనపు ఐజీని ఆదేశించారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments