Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedఇల్లు కూల్చడమే ఇందిరమ్మ పాలనా?

ఇల్లు కూల్చడమే ఇందిరమ్మ పాలనా?

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాకు చెం దిన ముగ్గురు మంత్రుల విలాసల కోసమే పేదల ఇళ్ళ ను కూల్చారని ఈ ముగ్గురు మంత్రులు మహా మయగాళ్లు అని రాష్ట్ర బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్లలో నిరాశ్రయిలైన నిరుపేదలను గురువారం ఆయన పరామర్శించారు. ముందు గా వెలుగుమట్లలో ఇళ్ళను తొలగించిన వినోభ (నవోదయ) కాలనీలోని భూదాన్ ట్రస్ట్ స్ధ్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్న బాధితులతో మాట్లాడారు.అనంతరం ఖ మ్మం నగరంలో అంబేద్కర్ భవనంలో ఆశ్రయం పొం దిన నిర్వాసితులను సైతం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భూదాన భూములు అంటేనే పేదలకు భూములను పంపిణీ చేయడం కానీ.. ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉండి కూడా పేదలకు భూమిని 

పంచకుండా ఉన్న భూమిలో నిర్మించుకున్న ఇళ్ళను నిర్దాక్షణ్యంగా కూల్చివేశారని ఆయన అన్నారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు 60 ఎకరాల మీద కన్నుబడిందని, ముగ్గురు మంత్రులు కలిసికట్టుగా ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని ఆయన అన్నారు. ఆర్ధరాత్రి శత్రుదేశంపై దండయాత్రకు వచ్చిన విధంగా పోలీలసులు వచ్చి కనీసం సామగ్రి సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా నడిరోడ్డుమీద నెట్టివేశారని ఆయన అన్నారు 2014 ఏప్రిల్ లో 1895 మందికి భూదాన ట్రస్ట్ వాళ్ళు పట్టాలు ఇచ్చారని , ఏళ్ల నుంచి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారని వారికి విద్యుత్ శాఖ కరెంట్ మీటర్లను, మున్సిపాల్టీ ఇంటి నెంబర్లు ఏలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

తాను భూదాన ట్రస్ట్ ఇచ్చిన పట్టాలను చూశానని, కోర్టు ఉత్తర్వులు కూడా చూశానని అవి అన్ని పేదలకు అనుకూలంగానే ఉన్నాయని ఆయన అన్నారు. భూదాన ట్రస్ట్ జారీ చేసినవి అక్రమ పట్టాలు అంటున్నారని అవి అక్రమ పట్టాలు కావు మంత్రుల బుద్ద్ధి అక్రమమని, దుర్మార్గమైన వక్ర బుద్ద్ధి అని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఇదే ప్రాంతంలో కలెక్టర్ బిల్డింగ్‌ను నిర్మించామని, ఆ తరువాత అక్కడ కెసిఆర్ ఆధ్వర్యంలో భారీ సభను కూడా ఏర్పాటు చేశామని అనాడు ఈ కాలనీ వాసులను అప్పటి ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకున్నామని కెటిఆర్ చెప్పారు.ముందుస్తుగా సమాచారం ఇవ్వకుండా ,కనీసం నోటిస్ ఇవ్వకుండా ,కోర్టుకు వెళ్ళేంత సమయం ఇవ్వకుండా రాత్రికి రాత్రే వచ్చి బీభత్సం సృష్టించారని దీని వల్ల ఇంటర్ పరీక్షలకు హాజరయ్య విద్యార్ధులంతా ఆగమాగం అయ్యారని ఆయన అన్నారు.అక్కడ చాలా మంది తమ బాధను వెలబోసుకున్నారని పదేళ్ల పాటు కష్టపడి సంపాదించుకున్న 12లక్షలతో కట్టుకున్న ఇంటిని కళ్ళముందే కూల్చివేశారని, ఏడు లక్షలు పెట్టి ఇళ్ళు కట్టుకొని సంవత్సరం కూడా కాలేదు నేలమట్టం చేశారని బాధితులు గోడువేలబోసుకున్నారని ఆయన అన్నారు .హైద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇళ్ళను కూల్చడమే ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా కన్పిస్తుందన్నారు.హైడ్రాను ఏర్పాటు చేసి హైద్రాబాద్ నగరంలో బడా బడా బిల్డింగ్‌లనే కూల్చివేస్తున్నారని ఆయన అన్నారు.

భూదాన భూముల్లో ఇళ్ళను నిర్మించుకుంటే అక్రమ కట్టడాలు అని ముద్ర వేసి కూల్చివేసిన విషయంపై రేపు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అంతేగాక మీ తరుపున న్యాయస్ద్థానంలో న్యాయ పోరాటం చేస్తామని కెటిఆర్ అభయం ఇచ్చారు. “మీతో కెసిఆర్ సార్ ఒక మాట చెప్పమన్నారు.. రెండేళ్ళ తరువాత రాష్ట్రంలో మళ్ళీ కెసిఆర్ ప్రభుత్వం వస్తుందని, మన ప్రభుత్వంలో ఇప్పుడు ఎక్కడయితే మీ ఇళ్ళను కూల్చివేశారో గెంటివేశారో అక్కడే మీకు ఇళ్ళను నిర్మించి ఇస్తామని అప్పటి వరకు మీరంతా అప్రమత్తంగా ఉండాలని “పిలుపునిచ్చారు. వెలుగుమట్ల కూల్చివేతలో రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందని ,తప్పు జరగబట్టే ఆర్డివోను బలి పశువును చేశారని,రాత్రికి రాత్రే ఆర్డీవోను బదిలీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తప్పుచేయకపోతే ముగ్గురు మంత్రులు వెలుగుమట్ల కు ఎందుకు రావడం లేదని, తప్పు చేశారు కాబట్టే మీ వద్దకు రావడానికి మొఖం చెల్లడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతామధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రేగా కాంతారావు, మాజీ జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజు, దిండిగల రాజేందర్, పగడాల నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments