
న్యూఢిల్లీ: ఎన్ సిఇఆర్‌టి ప్రచురించి న 8వ తరగతి పాఠ్య పుస్తకాలలో న్యాయవ్యవస్థలో అవినీతికి సంబంధించిన ఛాప్టర్లను తొలగించి కొత్తగా ప్రచురించడానికి సన్నాహాలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలను కాక, న్యాయవ్యవస్థలో అవినీ తి అంటూ ప్రచురించడం పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి, అ న్ని వర్గాలనుంచి నిరసన వ్యక్తం కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా రు. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిని న్యాయవ్యవస్థ పై తీవ్రమైన దాడిగా అభివర్ణించింది. 8వ తరగతి పాఠ్య పుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఉన్న ఒక అధ్యాహం పై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ బుధవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజలెవరూ న్యాయవ్యవస్థను కించపరచడాన్ని, న్యాయవ్యవస్థ సమగ్రతకు కళంకాన్ని ఆపాదించడానికి అనుమతించబోరని అన్నారు. సీనియర్ న్యాయమూర్తులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి సహా పలువురు సీనియర్ న్యాయవాదులు ఎన్ సిఇఆర్ టి పాఠ్య పుస్తకాల్లో న్యాయవ్యవస్థకు సంబంధించి అభ్యంతరకరమైన అంశాలు ఉన్నాయని, వెంటనే వాటిని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీంతో సిజేఐ తో పాటు జస్టిస్ జోయ్ మల్యబాగ్చి, విపుల్ ఎంపంచోలీ లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆవిషయాన్ని సూ మోటోగా పరిగణనలోకి తీసుకుంది.
8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకం అవినీతి, పెద్దసంఖ్యలో పెండింగ్ కేసులు, తగినంత సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో ముఖ్యమైనవని పేర్కొంది. పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అనే విభాగం న్యాయమూర్తులు కోర్టులో వారి ప్రవర్తన మాత్రమే కాక, దాని వెలుపల వారు ఎలా ప్రవర్తిస్తారో కూడా నిర్ణయించే నియమావళికి కట్టుబడి ఉంటారని పేర్కొంది. కొత్తగా చదువులు నేరుస్తున్న పిల్లలకు న్యాయవ్యవస్థలో అవినీతి గురించి బోధిస్తున్నారని చూసి తాము కలత చెందామని. ఇది ఎన్ సిఇఆర్ టి పుస్తకంలో భాగం అనీ.ఈ అధ్యాయం పూర్తిగా న్యాయవ్యవస్థకు అపకీర్తి ఆపాదించేదిగా ఉందని న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందిస్తూ న్యాయవ్యవస్థ సమగ్రతను ప్రశ్నించడాన్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. తనకు న్యాయనిపుణులనుంచి, హైకోర్టు న్యాయమూర్తుల నుంచి చాలా సందేశాలు వచ్చాయని వారంతా కలవరపడ్డారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకుని తాను ఇప్పటికే ఒక ఉత్తర్వు జారీ చేశానని సిజేఐ వెల్లడించారు.దేశంలోని వ్యవస్థల పనితీరును విశ్లేషించాలని భావిస్తే న్యాయవ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖల పాత్రను, పనితీరును సమానంగా చర్చించి ఉండాలనీ అభిప్రాయం వ్యక్తమైంది.
ప్రారంభదశలో ఉన్న విద్యార్థులకు వ్యవస్థ గొప్పతనాన్నికాక, లోపాలను ప్రస్తావించడం వల్ల తప్పుడు అభిప్రాయాలను కల్గించినట్లు కాగలదన్న అభిప్రాయం వ్యక్తమైంది. మార్చిన ఎడిషన్ లో మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర అనే అధ్యాయం ఉంది ఇది త్వరలో విడుదల అవుతుంది. ఈ చాప్టర్ లో భారత సుప్రీంకోర్టు లో ప్రస్తుతం దాదాపు 81,000 పెండింగ్ కేసులు ఉన్నాయని, న్యాయమూర్తుల కొరత, విధానపరమైన సంక్లిష్టతలు, మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఎదురైన పరిస్థితిని చర్చిస్తుంది. సవరించిన పాఠ్యాంశాల ప్రకారం హైకోర్టులు 60లక్షల కేసులను పరిష్కరిస్తుండగా, కింది కోర్టులు 40 లక్షలకు పైగా కేసులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.




