Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedకేరళ కాదు..కేరళం

కేరళ కాదు..కేరళం

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం మంగళవారంనాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చుతూ నిర్ణయం తీ సుంది. కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం. సేవాతీర్థ్‌లో జరిగిన కేబినెట్ సమావేశం నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలకు మంత్రివర్గం పచ్చజెండా ఊపిందన్నారు. ముడి జనపనారకు మద్దతు ధర మరో రూ.275 పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇ ప్పటి వరకు క్వింటాల్ ముడి జనపనారకు మ ద్దతు ధర రూ.5,925 పలుకుతోందని, తాజా పెంపుతో అది రూ.6200 కానుందన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం రైతులకు ఇది మేలు చేస్తుందన్నారు. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు కూడా మంతివర్గం నిర్ణయించిందన్నారు. దీనికి రూ.1677 కోట్ల అంచనాతో ఎయిర్‌పోర్ట్‌లో సివిల్ ఎన్‌క్లేవ్ నిర్మాణంతో పాటు విస్తరించనున్నట్లు తెలిపారు.

కనీసం 15 విమానాలు పార్కింగ్ చేశేలా నిర్మాణం ఉండబోతుందనారు. తద్వారా కశ్మీర్‌లోయతో పాటు మౌలిక వసతుల కల్పనకు ఇది మరింత దోహదపడుతుందన్నారు. అదే విధంగా సేవాతీర్థ్‌తో తొలి సారి మంత్రివర్గం భేటీ జరిగిందని, ఈ భవంతిలో తీసుకునే ప్రతి నిర్ణయం 140కోట్ల మంది భారతీయులకు సేవా ధృక్పథంతోనే తీసుకోవడం జరుగుతంద ని మంత్రివర్గం తీర్మానం చేసిందన్నారు. రా జ్యా ంగ స్ఫూర్తి, విలువలను మరింత పెంచే ది శగా నిర్ణయాలుంటాయని ఈ సందర్భంగా ప్ర ధాని మోడీ వ్యాఖ్యానించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. పని సంస్కృతికి నిదర్శనంగా సేవాతీర్థ్‌ను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆహ్మదాబాద్ మెట్రో ఫేజ్2కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మూడు రైల్వే ప్రాజెక్టులకు కూ డా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, బీహార్ మీదుగా మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు చేపట్టబోతున్నట్లు మంత్రి వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకే..

రాష్ట్రం పేరును సవరించాలని కోరుతూ తీసుకు వచ్చిన తీర్మానానికి ఇటీవల కేరళ శాసనసభ ఆమోదం తెలపడంతో పాటు కేంద్రాకి సిఫారసు చేసింది. తాజాగా కేంద్ర క్యాబినెట్ దీన్ని పరిగణన లోకి తీసుకుంది. కేరళ పేరును కేరళంగా అధికారికంగా మార్చాలని కేరళ అసెంబ్లీ మొదటిసారి 2023లో ఏకగ్రీవంగా తీర్మానించింది.తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ‘ కేరళం’ అని పిలిచే వారని అనేక సార్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ గుర్తు చేశారు. కానీ ఇతర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారని ఆయన తెలిపారు. పేరు మార్పు విషయమై బీజేపీ కూడా మద్దతు పలికింది. సిపిఐ కూడా స్వాగతించింది. ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాష్ట్రం అసలు పేరు కేరళం అని, కానీ బ్రిటిషర్లు తమ సౌకర్యం కోసం కేరళగా మార్చారని ముఖ్యమంత్రి వివరించారు. వారు చేసిన మార్పులను రాష్ట్ర సంస్కృతికి అనుగుణంగా సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. అంతకు ముందు కూడా కేరళ అసెంబ్లీ ఈ తీర్మానం ప్రతిపాదించినా హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ కొన్నిసాంకేతిక మార్పులను సిఫార్సు చేసింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత గుర్తింపు పొందిన అన్ని అధికారిక భాషల్లో కేరళ పేరును కేరళంగా మార్చుతారు.  

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments