Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedజూన్‌లో వరంగల్ విమానాశ్రయానికి శంకుస్థాపన

జూన్‌లో వరంగల్ విమానాశ్రయానికి శంకుస్థాపన

మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్‌లో మంగళవారం కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యా రు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధిపై పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌తో సమగ్రంగా చర్చించారు.రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయ ప్రాజెక్టుల పురోగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. ఈ సందర్భం గా వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి సహా తెలంగాణలో ప్ర తిపాదిత, పనులు జరుగుతున్న విమానాశ్రయ ప్రాజెక్టులపై విస్తృత చర్చ జరిగింది.

వరంగల్ విమానాశ్రయం విషయంలో మొత్తం 953 ఎకరాల భూమి విమానాశ్రయం కోసం అందుబాటులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో 2500 మీటర్ల రన్‌వే నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2026 జూన్ నెలలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేలా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఆదిలాబాద్‌లో విమానాశ్రయం కోసం భూసేకరణ ప్రక్రియ ఇం కా ప్రారంభం కాలేదని, అయితే రన్‌వే నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న ప్రస్తుత భూమిని వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పెద్దపల్లిలో విమానాశ్రయం కోసం 980 ఎకరాల భూమిని గుర్తించామని, దీనికి సంబంధించిన ఫీజిబిలిటీ స్టడీ జరుగుతున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ వెల్లడించారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments