Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedత్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0

త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0

మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చాలనే లక్ష్యంతో త్వరలోనే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ కు శ్రీకారం చుట్టబోతున్నామ ని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని మరింత పరుగులు పెట్టించే లా, పెట్టుబడిదారులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా, ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా అందరితో చర్చించి ఈ కొత్త విధానాన్ని రూ పొందిస్తామన్నారు.జూబ్లీహిల్స్‌లోని జెఆర్‌సి కన్వెన్షన్ సెంటర్‌లో ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాం బర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సీ) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘గ్రోత్ ఎక్స్ 2026’ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మం త్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. గ్రోత్ అంటే యాదృచ్ఛికంగా వచ్చేది కాదని, భావితరాల భవిష్యత్తు కోసం శాస్త్రీయం గా, ప్రణాళికాబద్ధంగా రూ పొందించుకోవాల్సిన అవస రం ఉందన్నారు. ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ విజన్ 2047’ను రూపొందించిందన్నారు. నగరం నుంచి గ్రామం వరకు ప్రతి ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ అజెండా అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు, ప్రముఖ వైద్యులు డా.నాగేశ్వర్ రెడ్డి, ఫ్యాప్సీ ప్రెసిడెంట్ ఆర్.రవి కుమార్, స్కై రూట్ ఏరో స్పేస్ ప్రతినిధి పవన్, గ్రోత్ ఎక్స్ 2026 కన్వీనర్ పంకజ్ దివాన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments