Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedభారీ ఉగ్రకుట్ర భగ్నం

భారీ ఉగ్రకుట్ర భగ్నం

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన లష్కరే -తోయిబా తో సంబంధం ఉన్న టెర్రరిస్ట్ ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ కు చెందిన 8మంది అనుమానితులను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు పాకిస్తాన్ కేం ద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, పాక్ గూఢచారి సంస్థ ఇంటర్ -సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఇఎస్‌ఐ) బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణ. విదేశీ టెర్రర్ గ్రూప్‌ల ఆదేశాలతో ఈ ముఠా భారతదేశంలో ఒక పెద్ద టెర్రరిస్ట్ దాడికి కుట్ర పన్నుతున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నా రు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న ఆరుగురిని, పశ్చిమ బెం గాల్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారు లు ఆదివారం తెలిపారు.

తమిళనాడులో అరెస్ట్ అ యిన వారిలో మిజనూర్ రెహమాన్, మహ్మద్ ష బాత్, ఉమర్, మహ్మద్ లితాన్, మహ్మద్ షాహిద్, మహ్మద్ ఉజ్జల్ ఉన్నారు. బెంగాల్ లో అరెస్ట్ అయిన వారు బంగ్లాదేశ్ జాతీయులు అని, నకిలీ ఆధార్ కార్డులు సేకరించి, తమ గుర్తింపు ను దాచేందుకు యత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ మాడ్యూల్ కు లష్కరే తోయిబాతో లింక్ లు ఉన్నాయి. దాని నిర్వాహకుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి పని చేస్తున్న కశ్మీర్ వ్యక్తి షబ్బీర్ అహ్మద్‌లోన్‌గా గుర్తించారు. షబ్బీర్ అహ్మద్‌లోన్‌కు నేరుగా ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్, లష్కరే కమాండర్ లఖ్వీతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అతడు పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ పొందాడని పోలీసులు తెలిపారు. తమిళనాడు, బెంగాల్ లో అరెస్ట్ అయిన 8 మంది అతడి సూచనల మేరకు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.

ఢిల్లీలో రద్దీగా ఉండే కీలక ప్రదేశాలలో ముఖ్యంగా మతపరమైన సంస్థలు, వారసత్వ కట్టడాలలో భీకర పేలుళ్లు సృష్టించేందుకు టెర్రరిస్టు గ్రూప్ కుట్ర పన్నుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై, దేశరాజధాని అంతటా హై అలర్ట్ ప్రకటించిన ఒకరోజు తర్వాత ఈ అరెస్ట్ లు జరిగాయి. ముఖ్యంగా చాందీనీ చౌక్ ప్రాంతంలోని ఓ ఆలయంపైదాడి కి కుట్రపన్నే అవకాశం ఉందని హెచ్చరికలు అందాయి. అలాగే ఎర్రకోట సమీపంలో రద్దీప్రాంతాల్లో, సున్నితమైన ప్రదేశాలలో టెర్రరిస్ట్ లు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ (ఐఐడి) దాడికి కుట్రపన్నుతున్నారని, నిర్దుష్టమైన సమాచారం అందిందని ఈ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సమయంలో అరెస్ట్ అయిన వ్యక్తులనుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డుల స్వాధీనం. వీటి ద్వారా డిజిటల్ ఆధారాలు, వారికి ఇతరులతో ఉన్న లింక్ లను కనిపెట్టేయత్నంలో పోలీసులు బిజీగా ఉన్నారు. టెర్రరిస్ట్ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే ఆన్ లైన్ పోస్ట్ లపై దర్యాప్తు తర్వాత మెరుపు వేగంతో ఆపరేషన్ చేపట్టారు. ఆదేశాలు అందడంతో తమిళనాడు లోని తిరుప్పూర్ కు స్థానిక పోలీసులు స్థానిక వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని చెక్ చేయగా, వారివద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్లు కనుగొన్నట్లు తమిళనాడులో ఆపరేషన్ పై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వివరించింది.

దుండగులను పట్టి ఇచ్చిన ఫ్రీ కశ్మీర్ పోస్టర్!

ఈ మధ్య ఢిల్లీ లోని దాదాపు పది ప్రదేశాలలో ఫ్రీ కశ్మీర్ అంటూ రెచ్చగొట్టే పోస్టర్లు చిక్కడంతో డొంక కదిలింది. ఇంటెలిజెన్స్ బ్యూరో సూచనలతో ఢిల్లీ స్పెషల్ సెల్ ఆపరేషన్ మొదలు పెట్టింది. టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతున్న నెట్ వర్క్ ను ఛేదించింది. ఫ్రీ కశ్మీర్ నినాదంతోపాటు రెచ్చగొట్టే పలు సూచనలు ఈ పోస్టర్లలో కన్పించాయి. దీంతో వీటిని అసలు ఎవరు ప్రచురీంచారని కూపీ లాగుతుండగా, తమిళనాడు నుంచి పని చేస్తున్న నెట్ వర్క్ అచూకీ తెలిసింది. ఫలితంగా అరెస్ట్ లు జరిగాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments