
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఏఐ సదస్సు వేదిక భారతీయ మండపంలో శుక్రవారం యువజనకాంగ్రెస్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. కొంద రు కార్యకర్తలు షర్టులు విప్పి, బనియన్లతోహాల్ నెంబరులో కొద్దిసేపు నినాదాలకు దిగారు. కేం ద్రంలోని మోడీ ప్రభుత్వ విధానాలు, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందానికి వీరు ఈ విధం గా దాదాపుగా అర్థనగ్నంగా మెరుపు ధర్నా చే పట్టారు. వారి చేతుల్లో మోడీ, ట్రంప్ బొమ్మలు ఉన్న టీషర్టులు ఉన్నాయి. హాల్ కలియతిరుగుతూ నినాదాలకు దిగడంతో పరిస్థితి అదుపు తప్పే విధంగా మారింది. విదేశీ ప్రతినిధులు, నేతలు పరిస్థితిని విస్తుపోతూ చూస్తూ ఉన్నారు. వెంటనే భద్రతా సిబ్బంది ఈ పది మందిని అదుపులోకి తీసుకుని తిలక్ మార్గ్ పోలీసు స్టేషన్‌కు తరలించింది. శాంతిభద్రతలను ఉ ల్లంఘించేలా ఎవరూ వ్యవహరించరాదని, వీరి ని వెంటనే ఇక్కడి నుంచి వెంటనే తొలిగించామ ని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనపై బిజెపి తీవ్రస్థాయిలో విమర్శించింది. ఏఐ సదస్సుతో భారతదేశానికి వస్తున్న ప్రపంచ స్థాయి ప్రతిష్ట కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, అందుకే ఈ విధంగా చేశారని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ విమర్శించారు.




