Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedఅఫ్గాన్‌లో గృహహింస చట్టబద్ధం

అఫ్గాన్‌లో గృహహింస చట్టబద్ధం

కాబూల్: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం మ హిళలపై విపరీతమైన ఆంక్షలు విధిస్తోంది. ఇది అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా సమాచారం ప్రకారం తాలిబన్లు కొత్త నేర నియమావళిని ప్రవేశ పెట్టారు. ఇది మహిళలు, పిల్లలపై తీవ్ర వివక్ష చూపిస్తోంది. ఇది ఎంత అరాచకమంటే భార్యలను భర్తలు శారీరకంగా హింసిం చవచ్చు. ఎముకలు విరగకుండా ఉంటే నేరం కా దంటూ గృహహింస చట్టాన్ని తీసుకొచ్చారు. రక్తస్రావం కానంతవరకూ ఇంట్లో మగవారు వారిని శారీరకంగా శిక్షించినా, అది శిక్ష కిందకు రాదు. తీవ్ర మైన దాడి జరిగినట్టు నిరూపితమైనాభర్తకు గరిష్టంగా కేవలం 15 రోజుల జైలు శిక్ష మాత్రమే విధిస్తారు. బాధిత మహిళ అలా కోర్టుకు వెళ్లినప్పు డు కూడా వెంట ఆమె బాధ్యత చూసుకునే పురుషుడు ఉండాలి.

అలాగే న్యాయమూర్తికి ఆమె తన గాయాలను చూపించినప్పుడు కూడా పూర్తిగా క వర్ చేసుకునే ఉండాలి. భర్త లేదా పురుష బంధు వు (మహ్రామ్) అనుమతి లేకుండా మహిళలు పు ట్టింటికి లేదా బయటకు వెళ్తే మూడు నెలల జైలు శిక్ష విధిస్తారు. మహిళలు బయట మాట్లాడితే వినపడకూడదు. ముఖం కనబడకుండా పూర్తిగా క ప్పుకోవాలి. ఈ కొత్త నిబంధనలపై అఫ్గాన్ సుప్రీం లీడర్ హిబుతుల్లా అఖుంద్జాదా సంతకాలు చేశా రు. ఈ కొత్త శిక్షాస్మృతి లో ఆర్టికల్ 9 ప్రకారం అఫ్గాన్ సమాజాన్ని మత పెద్దలు (ఉల్మా), ఉన్నతవర్గం(అష్రాఫ్), మధ్యతరగతి, దిగువ తరగతి అ నే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు. నేర తీవ్రతను బట్టి కాకుండా ఈ వర్గాల ప్రకారం శిక్షలు ఉంటాయి. 2009లో అధికారంలో ఉన్న అఫ్గాన్ ప్రభుత్వం మహిళలపై హింసకు వ్యతిరేకంగా తీ సుకొచ్చిన చట్టాన్ని కొత్త పీనల్ కోడ్ రద్దు చేసింది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments