
కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు జైలుశిక్ష పడింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని పేర్కొంటూ హైకోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. అనంతరం తీర్పు అమలుకు నాలుగు వారాల పాటు నిలిపివేసింది. అప్పీలు చేసుకునేందుకు కలెక్టర్‌కు నాలుగు వారాల గడువు ఇచ్చింది.




