
న్యూఢిల్లీ/ముంబయి: ద్వైపాక్షిక సంబంధాల ను ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యానికి తీసుకెళ్లాలని భారత్, ఫ్రాన్స్ నిర్ణయించుకున్నాయి. కీలక రంగాలైన రక్షణ, వాణిజ్యం, క్లి ష్టతర ఖనిజాలు సహా తదితర రంగాల్లో మరిం త సహకారం అందజేసుకోవాలని అవగాహన కు వచ్చాయి. మంగళవారంనాడు భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ముంబయిలో ని లోక్‌భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రోజురోజుకు పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ఫ్రాన్స్ సంబంధాలను ‘ప్రపంచ స్థిరత్వానికి శక్తి’ గా మోడీ, మేక్రాన్ అభివర్ణించారు. ఇరువురు నాయకులు ద్వైపాక్షిక చర్చల అనంతరం కర్నాటకలోని వేమాగల్‌లో ఎయిర్‌బస్ హెచ్125 హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. కీలకమైన ఖనిజాలు, రక్షణ, విస్తృత సాంకేతిక పరిజ్ఞానం, పునరుత్పాదక ఇంధనం, ఆరోగ్యం వంటి రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇరుపక్షాలు మొత్తం 21 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలలో ఒకటి రక్షణ సహకారంపై, మరొకటి భారతదేశంలో హామర్ క్షిపణులను ఉత్పత్తి చేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఫ్రెంచ్ రక్షణ దిగ్గజం సఫ్రాన్ మధ్య జాయింట్ వెంచర్‌గా ఉన్నాయి. భారత సైన్యం మరియు ఫ్రెంచ్ ల్యాండ్ ఫోర్సెస్ సంస్థలలో అధికారులను పరస్పరం మోహరించడానికి ప్రత్యేక ఒప్పందం కుదిరింది.
అనిశ్చితిలో ఈ బంధం ప్రపంచానికి శక్తినిస్తుంది : మోడీ
‘ప్రపంచం అనిశ్చితిని ఎదుర్కొంటోంది. అటువంటి వాతావరణంలో భారతదేశం- ఫ్రాన్స్ భాగస్వామ్యం ప్రపంచ స్థిరత్వానికి ఒక శక్తినిస్తుంది. మేము ఫ్రాన్స్ యొక్క నైపుణ్యం మరియు భారతదేశం యొక్క స్థాయిని మిళితం చేస్తున్నాము’ అని మోడీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు దేశాలు ‘చాలా ప్రత్యేకమైన సంబంధాన్ని‘ పంచుకుంటున్నాయని, భారతదేశానికి అత్యంత పురాతన వ్యూహాత్మక భాగస్వాములలో ఫ్రాన్స్ ఒకటి అని ప్రధాని కితాబునిచ్చారు. హెచ్-125 హెలికాప్టర్ అసెంబ్లీ లైన్ గురించి కూడా మోడీ ప్రస్తావించారు. ఇది ఇరుదేశాల నడము పరస్పర విశ్వాసానికి ఇది మరో అద్భుతమైన ఉదాహరణ అన్నారు. ఎవరెస్ట్ పర్వతం యొక్క ఎత్తులకు ఎగరగలిగే సామర్థ్యం ఉన్న ప్రపంచంలోని ఏకైక హెలికాప్టర్‌ను భారతదేశం మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా తయారు చేస్తాయని చెప్పడానికి గర్విస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. వాటిని ఇక్కడి నుంచే ప్రపంచం మొత్తానికి కూడా ఎగుమతి చేయబోతున్నట్లు వెల్లడించారు. తద్వారా భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యానికి సరిహద్దులు లేవని, అది లోతైన మహాసముద్రాల నుండి అత్యంత ఎత్తయిన పర్వత పంక్తుల వరకు చేరుకోగలదని మోడీ పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి పరిణామాలు, ఉగ్రవాదంపై ప్రతిన…
రష్యా-ఉక్రెయిన్ వివాదం, పశ్చిమ ఆసియా, ఇండో-పసిఫిక్ పరిస్థితులను ప్రస్తావిస్తూ… భారత్, ఫ్రాన్స్ రెండూ ప్రజాస్వామ్య విలువలను, చట్ట పాలనను, బహుళ ధ్రువ ప్రపంచాన్ని విశ్వసిస్తాయని ప్రధాని అన్నారు. ప్రపంచ స్థాయి సంస్థల్లో సంస్కరణలతోనే సవాళ్లకు పరిష్కారాలను కనుగొనగలమని తాము భావిస్తున్నట్లు పరోక్షంగా ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి మోడీ చెప్పారు. ఉక్రెయిన్, పశ్చిమ ఆసియా సహా అన్ని ప్రాంతంలో శాంతి కోసం చేసే ప్రయత్నాలకు తాము మద్దతు ఇస్తూనే ఉంటామన్నారు. భారతదేశం-ఇయు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఒక ‘మలుపు’గా అభివర్ణించారు. పరస్పర పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఇరు దేశాల ప్రజలు. కంపెనీలు రెట్టింపు పన్నులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉండటానికి ఒప్పందంపై సంతకం చేశామని, ఈ కార్యక్రమాలన్నీ పరస్పర వాణిజ్యం, పెట్టుబడులు మరియు చలనశీలతకు కొత్త ప్రేరణను ఇస్తాయని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇది భారత్, ఫ్రాన్స్ దేశాల సంక్షేమానికి రోడ్ మ్యాప్ అని అన్నారు. ఈ సందర్భంగా ‘ఇండియాఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్’ను కూడా ప్రారంభించారు.
భారత్ మా విశ్వసనీయ భాగస్వామి : మేక్రాన్
ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ మాట్లాడుతూ భారత్ తమ అత్యంత విశ్వసనీయ భాగస్వాములలో ఒకటి అని అన్నారు. ‘రాఫెల్ జెట్ల నుండి జలాంతర్గాముల వరకు రక్షణ సహకారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాలు చట్టబద్ధమైన పాలనను గట్టిగా విశ్వసిస్తాయని, ఇది గత కొన్ని సంవత్సరాలుగా నిరూపించబడిందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్, ఫ్రాన్స్ సహకారాన్ని కొనసాగిస్తాయని మేక్రాన్ అన్నారు.
విమానం దిగగానే జాగింగ్.. 26/11 మృతులకు నివాళి..
మంగళవారంనాడు ఉదయాన్నే ముంబై విమానాశ్రయంలో దిగిన మేక్రాన్ దంపతులు ఇక్కడి ప్రఖ్యాత మెరైన్ డ్రైవ్‌లోని తీరప్రాంత రోడ్డు జాగింగ్ చేశారు. అంనతరం అక్కడి నుంచి తాజ్ ప్యాలెస్ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ ముంబై ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ముంబై పోసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతకుముందు విమానాశ్రయంలో మేక్రాన్‌కు మహారాష్ట్ర గవర్నర్ దేవవ్రత్, సిఎం ఫడ్నవీస్ ఆహ్వానం పలికారు.




