Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedసినీ నటి ప్రత్యూష మృతి కేసు..నాలుగు వారాల్లో లొంగిపోండి

సినీ నటి ప్రత్యూష మృతి కేసు..నాలుగు వారాల్లో లొంగిపోండి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రముఖ టాలీవుడ్ సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళ వారం తుది తీర్పును వెలువరించింది. రెండు ద శాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మ నోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మా సనం కీలక తీర్పును వెలువరించింది. సిద్ధార్థరెడ్డి పిటిషన్‌ను కొట్టివేస్తూ నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఈ కేసులో పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదని అభిప్రాయపడింది. సినీ నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23న మృతి చెందారు. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రో పాలిటన్ సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును సిద్ధార్థరెడ్డి హైకోర్టులో సవాల్ చేయడంతో జైలు శిక్షను రెండేళ్లకు కుదించింది. హైకోర్టు తీర్పును ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మరోవైపు, శిక్షను రద్దు చేయాలని సిద్ధార్థరెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇరువైపుల వాదనలు విన్నది. గత ఏడాది నవంబర్‌లో విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు, తీర్పును రిజర్వ్ చేసిం ది. ఈ కేసుకు సంబంధించి 24 ఏళ్ల తర్వాత మంగళవారం తీర్పును వెలువరిస్తూ, సిద్ధార్థరెడ్డిని లొంగిపోవాలని ఆదేశించింది.

2002లో తాను, ప్రత్యూష పురుగుల మందు తాగి ఆత్మహత్య కు ప్రయత్నించామని, తాను ఆసుపత్రిలో చికిత్స పొందడంతో ప్రాణాలతో బయటపడ్డానని సిద్ధార్థ రెడ్డి చెబుతున్నారు. తన కూతురు ఆత్మహత్యకు సిద్ధార్థరెడ్డి కారణమని సరోజిని ఆరోపించారు. ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7.308 గంటల మధ్య ఇద్దరూ విషం తాగిన పరిస్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష 24న చనిపోయా రు. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు. వారు కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో గుర్తించారు. ఆర్గానోఫా స్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని ఊపిరాడకుండా చేయడం, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి వంటివి జరగలేదని రాష్ట్ర ప్రభు త్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా దర్యాప్తు జరిపిన సిబిఐ నిందితుడిపై 306, 309 సెక్షన్ల కింద చార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు ఇచ్చారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ జరిమానా ను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పును ఇచ్చింది. దీనిపై సిద్ధార్థరెడ్డి తల్లి సరోజినిదేవీ 2012లో సుప్రీం కోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

సుప్రీంకోర్టు తీర్పుపై ప్రత్యూష తల్లి సరోజిని స్పందన

సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆమె తల్లి సరోజిని స్పందించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, కానీ ప్రత్యూ ష మృతికి న్యాయం జరగలేదని అవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో నిందితుడికి యావజ్జీవ శిక్షపడుతుందని ఆశించినట్లు తెలిపారు. అప్పట్లో మునుస్వామి ఇచ్చిన పోస్టుమార్టం రిపోర్టును పరిగణలోకి తీసుకుని ఉంటే ఖచ్చితంగా శిక్షపడి ఉండేదని అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో తాను సంతృప్తి చెందలేదన్నారు. తన కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని, తనని అత్యాచారం చేసి చంపారని ఆమె ఆరోపించా రు. అన్యాయంగా ఒక నిండు ప్రాణాలను తీసి, తమ కుటుంబాన్ని ఇటువంటి పరిస్థితికి తీసుకొచ్చారన్నారు. నిందితుడికి యావజీవ శిక్ష పడి ఉంటే ప్రత్యూష ఆత్మకు శాంతి కలిగేదని, తమ పోరాటానికి ఒక అర్థం ఉండేదన్నారు. అయిన్నప్పటికీ సుప్రీం కోర్టు తీర్పును తాము గౌరవిస్తున్న ట్లు వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments