Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedపాక్ ను చిత్తుగా ఓడించిన భారత్..

పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్..

కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో మరోసారి పాకిస్తాన్ జట్టును భారత్ చిత్తుగా ఓడించింది. పాక్ పై టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటర్లను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో పాక్.. తొలి ఓవర్ నుంచే వరుసగా వికెట్లు చేజార్చుకుంది. దీంతో 18 ఓవర్లలోనే పాక్ 114 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ వరుసగా మూడో విక్టరీని సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, పాండ్యాలు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ సింగ్, తిలక్ వర్మ చెరో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 77 పరుగులతో మెరుపులు మెరిపించాడు. తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25), శివమ్ దూబే(27)లు పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో సయామ్‌ ఆయుబ్ 3 వికెట్లు పడగొట్టగా.. సల్మాన్, షహీన్‌ చెరో వికెట్‌ తీశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments