Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedవార ఫలాలు (15-02-2026 నుండి 21-02-2026 వరకు)

వార ఫలాలు (15-02-2026 నుండి 21-02-2026 వరకు)

మేష రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఉద్యోగపరంగా విద్యాపరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాల నిమిత్తం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు లభిస్తాయి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఏలిన నాటి శని నడుస్తుంది కావున ప్రతిరోజు శని గ్రహ స్తోత్రం చదవండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ పరంగా చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. నలుగురిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. మీరు ఆత్మవిశ్వాసంతో మనోబలంతో మొదలుపెట్టిన ప్రతి పని పూర్తి అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి పొదుపు పైన దృష్టి పెట్టండి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. నూతన కాంట్రాక్టులు ప్రాజెక్టులు లభిస్తాయి. తల్లిదండ్రులతో మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగంలో పై అధికారులతో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సమాజ సేవలో పాల్గొంటారు. గో సేవ చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి వారు కాలభైరవ రూపు మెడలో ధరించండి. అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈరోజు వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మిధున రాశి వారికి వారం చాలా బాగుంది. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వివాహ సంబంధమైన విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో కాలం ఆనందంగా గడిచిపోతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కొన్ని అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. నలుగురిలో ప్రత్యేకంగా కనబడడానికి శ్రద్ధ చూపుతారు. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. లాభాలు మీరు ఆశించిన విధంగా ఉంటాయి. నూతన గృహం కొనుగోలు చేస్తారు. ప్రతిరోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కర్కాటక రాశి వారికి వారం చాలా బాగుందని చెప్పవచ్చు. పూల ప్రాంతం ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించాలి. విహారయాత్రలలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. వృత్తి ఉద్యోగాలపరంగా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం వాయిదా వేయడం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వైద్యవృత్తుల వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఈ రాశి వారికి కలిసి వచ్చేసరికి 5 కలిసివచ్చే రంగు ఎల్లో. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

సింహరాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. నూతన గృహప్రవేశం చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. ఇంటా బయట చిన్నచిన్న సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది పెడుతాయి. ఉద్యోగ పరంగా నూతన బాధ్యతలు పెరుగుతాయి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి సినీ కళా రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. కాలభైరవ రూపు మెడలో ధరించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

కన్యా రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. నడిచిన వారం కంటే వారం బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అన్ని అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. లాభాలు బాగుంటాయి. కొరియర్ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది. విదేశాలకు వెళ్లడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సహోదరీ సహోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చదువుపై శ్రద్ధ వహించండి మీరు ఆశించిన ఫలితాలను సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా అష్టమూలికా తైలంతో ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వ్యాపార పరంగా లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. నడిపించే ప్రయత్నం వ్యాపారాన్ని నూతన మార్గంలో నడిపించడానికి ఆలోచనలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు నిత్యవసర సరుకులు అమ్మేవారికి లాభాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు మీకు కలిసి వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోండి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారు ఈ వారం శుభవార్త వింటారు. ప్రతిరోజు ఓం నమశివాయ వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. విద్యార్థినీ విద్యార్థులు ప్రతిరోజూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు డార్క్ గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు మంచి అవకాశం అని చెప్పవచ్చు. పై అధికారుల అండదండలు లభిస్తాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి చేసే ప్రతి పనిలోనూ కష్టం కనిపిస్తుంది పదిమంది మెచ్చుకోలుగా ఉంటుంది వ్యాపారపరంగా కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వారికి, డేటా సైన్స్, డాక్యుమెంట్ రైటర్స్ కి, లాయర్లకి వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగం వారికి కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు చిన్న చిన్న అవకాశాలు వచ్చి చేజారి పోతుంటాయి అయినా దిగులు పడాల్సిన పనిలేదు. దూర ప్రాంత ప్రయాణాలు వీరికి కలిసి వస్తాయి. ప్రయాణాలు కూడా ఎక్కువగా చేయవలసి ఉంటుంది. వచ్చిన అవకాశం వీరు చక్కగా ఉపయోగించుకుంటారు. పదిమందిలో తనకంటూ ఒక మంచి స్థానం ఉండాలని కోరుకుంటారు అది నెరవేరుతుంది. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. సంతానాభివృద్ధి కూడా చక్కగా ఉంటుంది. ఒక శుభవార్తను వింటారు. సంతానానికి సంబంధించిన వివాహ విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. పరీక్షల సమయం కాబట్టి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఐదుసార్లు లేదా 11 సార్లు పఠించండి. అలాగే దక్షిణామూర్తి రూపు కూడా మెడలో ధరించండి. సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అవుతున్న వారికి అవకాశాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత విష వ్యవహారాలు షార్ట్ టర్మ్ వెళ్లి వచ్చేవారికి కాలం చక్కగా కలిసి వస్తుంది. సొంతింటి కల నెరవేరుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు సుబ్రహ్మణ్యస్వామి అష్టకం చదవడం అలాగే సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయించటం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

ధనుస్సు రాశి వారికి గడిచిన వారం కంటే ఈ వారం అనుకూలంగా ఉంది. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. లాభాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి పై అధికారులు అండదండలు లభిస్తాయి. మన కిందిస్థాయి ఉద్యోగులు మనల్ని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి. నూతన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి సంబంధం కుదురుతుంది. ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేసిన వారికి కూడా మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది.ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి భవిష్యత్తు కోసం చేసుకున్న ప్రణాళికలు చాలా చక్కగా కలిసి వస్తాయి. ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి కలిసి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి సాఫ్ట్వేర్ రంగం వారికి చిరు వ్యాపారస్తులకు కొంతవరకే అనుకూలంగా ఉంటుంది. సిని కళా రంగం వారికి బ్యూటీషియన్స్ కి టెక్నికల్ వారికి కాస్త మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసివచ్చే సంఖ్య ఏడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి

మకర రాశి వారికి వారం చాలు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చాలా లాభసాటిగా ఉంటాయి. కుటుంబ పరంగా చిన్నచిన్న విభేదాలు తలెత్తుతాయి జాగ్రత్త వహించండి. మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి కానీ సమయానికి రావు. ఆరోగ్యానికి సంబంధించి స్కిన్ ఎలర్జీ ఎసిడిటీ గ్యాస్టిక్ సంబంధిత జబ్బులతో ఇబ్బంది పడతారు వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధిత విష వ్యవహారాలు చేతిదాకా వచ్చి చేజారి పోతాయి. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. అదేవిధంగా కుటుంబంలోని తల్లిదండ్రుల సహాయ సహకారాలు వీరికి చక్కగా లభిస్తాయి. కుటుంబంలోని అందరి సహాయ సహకారాలు ఉన్నప్పటికీ ఉన్నతంగా ఎదగాలనే ఆలోచన వీరికి ఎక్కువగా ఉంటుంది. మీరు చేసే పనులలో నిజాయితీగా నీతిగా ఉండగలుగుతారు. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా పక్క వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి తోటి వారితో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పదిమంది సలహాలు తీసుకొని ఏది మంచిదో నిర్ణయించుకొని ముందుకు వెళ్ళండి తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులకు గురి కావొద్దు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి చదువు మీద శ్రద్ధ వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా పిఆర్ కోసం హెచ్ వన్ బి వీసా కోసం గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు కొంత నెమ్మదిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా లాభసాటి గానే ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి ముఖ్యంగా జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమని చెప్పవచ్చు. మంచి శుభవార్తలు వింటారు. సంతనానికి సంబంధించిన విషయాలు వివరాలు అనుకూలంగా ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఒక శుభవార్త వింటారు. ఈ రాశి వారు ప్రతి రోజు అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం కాలభైరవ రూపు మెడలో ధరించడం చెప్పదగిన సూచన. శనివారం నాడు శని కి తైలాభిషేకం కానీ శివుడికి రుద్రాభిషేకం కానీ చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా 4 కలిసివచ్చే రంగు బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. ఏలినాటి శని నడుస్తుంది. ఉద్యోగరీత్యా బదిలీలు కలిసి వస్తాయి అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగం మారే అవకాశం గోచరిస్తుంది. పనిలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఉద్యోగంలో మీరు ఏ పని చేసినా అధికారుల మెప్పు పొందకపోవటమే కాకుండా వారి నుంచి అధిక ఒత్తిడి ఉంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలము లభించదు. ఉద్యోగం మారాలనుకునే ఆలోచనలు వస్తాయి కానీ అవి సరైనవి కావు ఏది ఏమైనా సరే ఉన్న ఉద్యోగంలోనే స్థిరంగా ఉండటం మంచిది. అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం గోచరిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల వల్ల నష్టం వాటిల్లే అవకాశం కనిపిస్తుంది. లాభాలు మాత్రం కొంతవరకే ఉంటాయి. కానీ పేరు ప్రఖ్యాతలు కలిసి వస్తాయి. ఒకసారి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మనమే నష్టపోతామని తెలుస్తుంది. వివాహాది శుభకార్యాలు చక్కగా ఉన్నాయి. మంచి సంబంధం కుదురుతుంది. వచ్చిన అవకాశాన్ని జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన. వాహనాలు నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కిన్ సంబంధిత విషయాలలో జాగ్రత్త వహించండి. అలాగే కుటుంబంలోని వాతావరం చాలా అశాంతిగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయం పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఏదేమైనాప్పటికీ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటే మంచిది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు వీరికి కలిసి వస్తాయి. గ్రూప్స్కు ప్రిపేర్ అయ్యేవారికి సివిల్స్ కి పి హెచ్ డి చేస్తున్న వారికి కాలం కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా అనుకూలంగా ఉంది. కళ రంగంలో ఉన్న వారికి ఈ వారం కలిసి వస్తుంది. వ్యాపారస్తులు అందరికీ అనుకూలంగా ఉంది. ఫార్మా రంగం వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది శ్రమకు తగిన ప్రతిఫలం లభించదు. సోదర సోదరీమణుల పట్ల విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. డబ్బు పరంగా వీరికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఆరోగ్యం పట్ల ఎట్టి పరిస్థితిలో అశ్రద్ధ చేయకండి. ఈ రాశి వారు ప్రతి రోజు శని స్తోత్రం చదవండి అలాగే హనుమాన్ చాలీసా చదవటం చెప్పదగిన సూచన. కాలభైరవ రూపును మెడలో ధరించండి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ సోమవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.

మీన రాశి వారికి వారం చాలా అనుకూలంగానే ఉంటుంది. జన్మరాశిలో శని బలంగానే ఉన్నారు. వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుంది. సలాం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరుతుంది. ఒక చోట స్థిరాస్తిని అమ్మి మరొకచోట పెట్టుబడి పెడతారు. శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా కొంతవరకు అభివృద్ధి సాధించగలుగుతారు. రుణాలు తీరుస్తారు. విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డు పిఆర్ లభిస్తుంది. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. కోర్టు తీర్పులు కొంత ఇబ్బంది పడతాయి. మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకైనా లభిస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు కష్టపడి చదవవలసిన సమయం. ముఖ్యమైన విషయాలలో సంత నిర్ణయాలు శ్రేయస్కరం కాదు. ఈ రాశి వారు ప్రతి రోజు కూడా అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments