Monday, March 2, 2026
Google search engine
HomeUncategorizedటి20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కు రెండో విజయం

టి20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ కు రెండో విజయం

కొలంబో: టి20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం గ్రూప్‌ఎలో భాగంగా యుఎస్‌ఎతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన యుఎస్‌ఎ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. ఓపెనర్లు జహాంగిర్, అండ్రీస్ గౌస్‌లు యుఎస్‌ఎకు మెరుగైన ఆరంభాన్ని అందించారు. జహాంగిర్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. గౌస్ రెండు ఫోర్లతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు.

అయితే కీలక ఇన్నింగ్స్ ఆడిన జహాంగిర్ 34 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. మిలింద్ కుమార్ (29) పరుగులు సాధించాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన శుభం రంజానె 30 బంతుల్లోనే 3 ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. కానీ మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో యుఎస్‌ఎకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఉస్మాన్ మూడు, షాదాబ్ ఖాన్ రెండు వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను ఓపెనర్ సాహెబ్‌జాదా ఫర్హాన్ ఆదుకున్నాడు. అమెరికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఫర్హాన్ 41 బంతుల్లోనే 6 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. బాబర్ ఆజమ్ (46) కూడా మెరుగైన ఆటను కనబరిచాడు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments