
మన తెలంగాణ/హైదరాబాద్‌ః మున్సిపల్ ఎన్నికలకు పార్టీ నిర్ణయించిన అభ్యర్థులు కాకుండా బరిలో నిలిచిన తిరుగుబాటు అభ్యర్థులపై బిజెపి రాష్ట్ర నాయకత్వం కన్నెర్ర చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంతో పాటు పార్టీ నిర్ణయాన్ని కాదని జగిత్యాల మున్సిపాలిటీలో రెబెల్స్‌గా బరిలోకి దిగిన పదమూడు మంది అభ్యర్థులపై బిజెపి అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. కాగా ఈ పరిణామం పార్టీ ప్రతిష్టను కాపాడడం, పార్టీ అభ్యర్థుల్లో విశ్వాసాన్ని నింపేలా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.




