
రాజస్థాన్‌లో భర్తను మార్నింగ్ వాక్‌కు తీసుకువెళ్లి చంపించింది ఓ భార్య. ఇంతకు ముందు మేఘాలయాలో జరిగిన హానిమూన్ హత్యను ఈ ఘటన తలపించింది. రాజస్థాన్ శ్రీ గంగాపూర్‌కు చెందిన ఆశిషు, అంజూలకు ఇటీవలే పెళ్లయింది. గత వారం భర్తను తీసుకుని భార్య మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లింది. అత్యంత తెలివిగా తన భర్తను హత్య చేయించిన అంజూ తమను ఓ కారు వేగంగా వచ్చి ఢికొందని , తాను స్పృహ తప్పిపడిపోయానని తెలిపింది. తన భర్తకు ఏమైందో తెలియదని పోలీసులకు తరువాత వివరించింది. అయితే భర్త చనిపోయాడు. తమను ఎవరో వాహనంతో ఢీకొట్టారని, తన వంటిపై నగలు తీసుకని ఉడాయించారని యువతి తెలిపింది. పోలీసులు ఈ కేసును ఇంతకు ముందు మేఘాలయాలో జరిగిన హానీమూన్ హత్యోదంతం ఆధారంగా విచారించారు. దీనితో ఈ యువతి తన ప్రియుడు సంజూ ఇతరులు ఇద్దరితో కలిసి చంపించి, తెలివిగా ప్రమాదంగా నమ్మచూపిందని విచారణలో తేలింది. తనకు ఆశిషు అంటే ఇష్టం లేదని, ఆయనను వదిలించుకోవడానికి ఈ విధంగా తన పాత ప్రియుడితో య ప్లాన్ చేసినట్లు తెలిపింది. ఇప్పుడు ఈ కేసు హానీమూన్ హత్య 2.0గా ప్రచారంలోకి వచ్చింది.




