Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedవిశాఖలో ఎసిబికి చిక్కిన అవినీతి తిమింగలం

విశాఖలో ఎసిబికి చిక్కిన అవినీతి తిమింగలం

 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎపిలోని విశాఖలో ఇటీవలే పదవీ విరమణ చేసిన పంచాయతీరాజ్ ఎస్‌ఇ శ్రీనివాసరావును ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. సాలూరు, విశాఖ, హైదరాబాద్ సహా ఐదు చోట్ల జరిపిన సోదాల్లో అక్రమ ఆస్తులకు సంబం ధించిన కీలక ఆధారాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు డాక్యుమెంట్లతో పాటు మూడు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, రెండు ప్లా ట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమిని, రూ.61.87 లక్షల నగదు, దాదాపు రెండున్నర కిలోల బంగారం, 20 కిలోలకు పైగా వెండి, కారు, ద్విచక్రవాహనంతో పాటు విలువైన గృహోపకరణాలు గుర్తించినట్లు ఎసిబి అధికారులు వెల్లడించారు. కాగా, సోదాల్లో ఐదు బ్యాంకు లాకర్లు లభిం చాయంటూ శుక్రవారం లాకర్లు తెరువనున్నట్లు ఎసిబి అధికారులు తెలిపారు. కాగా, పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్(ఎఇ)గా 1990 లో చేరిన శ్రీనివాసరావు, ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. అనంతరం పదోన్నతిపై సూపరింటెండెంట్ ఇంజి నీర్ ర్యాంకు పొంది 2025 డిసెంబర్ 31న పదవీ విరమణ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments