Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedవికసిత్ భారత్ బడ్జెట్:ఎంపి ఈటల

వికసిత్ భారత్ బడ్జెట్:ఎంపి ఈటల

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారని బిజెపి లోక్‌సభ సభ్యుడు ఈటల రాజేందర్ ప్రశంసించారు. అభివృద్ధి, ప్రజా రంజక బడ్జెట్ అని ఆయన ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఉపాధి, చేతి వృత్తుల వారికి, ఆరోగ్యానికి పెద్ద పీట వేశారని ఆయన తెలిపారు. దూరదృష్టితో దీర్ఘకాలిక నిర్ణయాల వల్ల భారత జిడిపి ఏడు శాతం పెరిగిందని ఆయన తెలిపారు. గత ఏడాది యాభై లక్షల కోట్ల రూపడాయల బడ్జెట్ ప్రవేశపెడితే ఈ ఏడాది యాభై మూడు లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టారని ఆయన చెప్పారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గత ఏడాది బడ్జెట్‌లో నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెడితే ఈ ఏడాది కూడా పెట్టారని ఆయన తెలిపారు. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియాకు అనుగుణంగా యువశక్తి దేశ పురోగమనంలో భాగస్వాములు చేయాలని లక్షంతో బడ్జెట్ పెట్టారని ఆయన చెప్పారు. ఇంకా అనేక మందులపై దిగుమతి పన్ను తగ్గించారని, క్యాన్సర్‌తో పాటు పదిహేడు రకాల మందులపై పన్ను రాయితీ ఇచ్చి పేద రోగులకు ఉపశమనం కల్పించారని ఈటల రాజేందర్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments