
అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ’విత్ లవ్’. మదన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ ఎంఆర్‌పి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించారు. ’విత్ లవ్’ చిత్రం ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోంది. మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. “ట్రైలర్ చూసిన అందరూ కూడా చాలా కనెక్ట్ అయ్యారు. సౌందర్య తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను”అని తెలియజేశారు. ప్రొడ్యూసర్ సౌందర్య రజనీకాంత్ మాట్లాడుతూ “అభిషన్‌ని హీరోగా లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. తను డైరెక్ట్ గా మంచి సక్సెస్ ఇచ్చాడు. ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో అభిషన్ జీవింత్, హీరోయిన్ అనస్వర రాజన్, దర్శకుడు మదన్, ప్రొడ్యూసర్ మహేష్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.




