Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedఈగల్ టీం భారీ ఆపరేషన్.. 12 మంది అరెస్ట్

ఈగల్ టీం భారీ ఆపరేషన్.. 12 మంది అరెస్ట్

మన తెలంగాణ/హైదరాబాద్ : మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా ఈగల్ టీం భారీ రాష్ట్రంలో భారీ ఆపరేషన్ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల కేసుల్లో పోలీసుల కళ్లు కప్పి తప్పించుకుని తిరుగుతున్న 12 మందిని ఈగల్ టీం అరెస్ట్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఈగల్ టీం డైరెక్టర్ సందీప్ శ్యాండిల్య గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులుగా ఉన్న వివిధ జిల్లాలకు చెందిన వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచిందన్నారు.

ఈ ఆపరేషన్‌లో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని నిందితులయిన నాయ్ని సాయి అక్షిత్, మల్లూరి యశ్వంత్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అంబారిపేట అశ్విన్ కుమార్, సయ్యద్ షాహేద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని వేదాంత్ గుప్తా, రిషబ్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని షేక్ ఖాజా ఫరీదుద్దీన్, సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని మహ్మద్ సమీర్, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని దుర్గం కృష్ణ కుమార్, ఖమ్మం కమీషనరేట్ పరిధిలోని దుబ్బాకుల రామకృష్ణా, వనపర్తికి చెందిన పాలెం వినయ్ లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతుందని డైరెక్టర్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments