Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..

ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్..

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో ’స్పిరిట్’, ’ఫౌజి’ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ’స్పిరిట్’ను వచ్చే ఏడాది మార్చిలో విడుదలకు ప్లాన్ చేస్తుండగా, ’ఫౌజి’ ఈ ఏడాది కాకుండా వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలున్నాయి. ఈ రెండు చిత్రాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ’కల్కి 2898 ఎడి: పార్ట్ 2’ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్రభాస్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే పార్ట్ 2 షూట్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది కానీ ప్రభాస్ ఇతర సినిమాల మూలాన ఆగుతూ వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం కల్కి 2 సినిమా షూట్ కి ప్రభాస్ సిద్ధమైనట్టు తెలిసింది. కల్కి 2 షూట్‌ని ఫిబ్రవరి 2 నుంచి డార్లింగ్ మొదలు పెట్టనున్నాడట. దీనితో పాటు స్పిరిట్ షూట్‌ని కూడా ప్రభాస్ బ్యాలెన్స్ చేస్తూ వెళ్తాడని తెలిసింది. ఇక ఈ భారీ సినిమాలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాలు నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. వైజయంతి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ‘కల్కి’ ఫస్ట్ పార్ట్‌లో దీపికా పదుకొనే నటించిన సుమతి పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

అయితే కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఇప్పుడు దీపిక స్థానం కోసం మొదట అలియా భట్, ప్రియాంకా చోప్రా, అనుష్క శెట్టి, శ్రద్ధా కపూర్, కల్యాణి ప్రియదర్శన్ పేర్లు వినిపించాయి. ముఖ్యంగా ప్రియాంకా చోప్రా పేరు గట్టిగా ప్రచారంలోకి వచ్చినా, చివరికి ఈ కీలక పాత్రకు సాయి పల్లవి పేరు బలంగా వినిపిస్తోంది. సాయి పల్లవి అయితే ’కల్కి 2’ స్టోరీకి, ప్రభాస్‌కు జోడీగా సెట్ అవుతుందని నాగ్ అశ్విన్ భావిస్తున్నాడనే టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments