Wednesday, April 22, 2026
Google search engine
HomeUncategorizedనాలుగో టి20లో కివీస్ గెలుపు

నాలుగో టి20లో కివీస్ గెలుపు

విశాఖపట్నం: నాలుగో టి20 భారత్ చిత్తయింది. వరుస విజయాలతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియాకు న్యూజిలాండ్ షాకిచ్చింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో50 పరుగుల తేడాతో సూర్యాకమార్ సేనాను చిత్తు చేసింది కివీస్. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో దెవోన్ కాన్వే(44), టిమ్ షెఫార్ట్(64)లు టీమిండియా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. తొలి వికెట్‌కు 101 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరికి తోడు డారీల్ మిఛెల్(38), గ్లెన్ ఫిలిఫ్స్(24)లు బ్యాట్ ఝలిపించడంతో కివీస్ భారీ స్కోరు చేయగలిగింది.

అనంరతం లక్ష ఛేదనకు దిగిన టీమిండియాకు అదిలో గట్టి షాక్ తగిలింది. ఫించ్ హిట్టర్ అభిషేక్ శర్మ(0) పరుగులేమి చేయకుండా పెవిలియన్ చేరాడు. అనంతరం సంజూ సామ్‌సన్(24) కాసేపు మెరిసినా.. పరుగులు రాబట్టలేక పోయాడు. సాట్నర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్‌కు దారిపట్టాడు. సూర్యా కుమార్(8) సయితం రాణించలేక పోయాడు. రింకు సింగ్(39), శివం ధూబె(64) బ్యాట్ ఝలిపించినా మిగతావారెవరూ రాణించక పోవడంతో పూర్తి ఓవర్లు ఆడకుండానే 165 పరుగులకే టీమిండియా చాపచుట్టేసింది. దీంతో భారత్ ఘోరపరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments