Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedసీవర్ నయా చరిత్ర.. డబ్లూపిఎల్‌లో తొలి శతకం నమోదు

సీవర్ నయా చరిత్ర.. డబ్లూపిఎల్‌లో తొలి శతకం నమోదు

వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్ 2026) సీజన్‌లో అరుదైన రికార్డు నమోదైంది. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ సెంచరీ సాధించి నయా చరిత్ర సృష్టించింది.

విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన బ్రంట్ 57 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో అజేయంగా 100 పరుగులు చేసింది. దీంతో డబ్లూపిఎల్ చరిత్రలోనే తొలి సెంచరీ సాధించిన బ్యాటర్‌గా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఓ బ్యాటర్ సెంచరీ సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సివర్ అజేయ శతకానికి ఓపెనర్ హేలీ మాథ్యూస్ (56) అర్ధ సెంచరీ తోడు కావడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments