
మెజాన్‌లో ఉద్యోగాల మంగళం
వచ్చే వారం 14 వేల జాబ్స్ పై వేటు
వాషింగ్టన్ : ఆన్‌లైన్ దిగ్గజ వ్యాపార సంస్థ అమెజాన్‌లో దాదాపుగా మరో 14000 కార్పొరేట్ ఉద్యోగాలపై వేటు పడనుంది. మంగళవారం నుంచి ఈ తొలిగింపుల ప్రక్రియ చేపడుతారని వెల్లడైంది. వచ్చే వారంలో ఈ కీలక పరిణామం జరుగుతుందని రాయిటర్స్‌తెలిపింది.సంస్థ అంతర్గత వర్గాల ద్వారా ఈ సమాచారం అందిందని తెలిపారు. అంతర్గత బ్యూరోక్రసీ భారం తగ్గించుకునేందుకు, దాదాపుగా 30 వేల మంది వైట్‌కాలర్ ఉద్యోగులను తొలిగించేందుకు కంపెనీ సిద్ధం అయింది. ఇందులో భాగంగానే 14 వేల నుంచి 16 వేల వరకూ జాబ్స్‌పై వేటుపడుతుంది. వీరంతా ఉద్యోగాలు కోల్పోతారు. ఈ లే ఆఫ్‌ల దశ 27వ తేదీ నుంచి ఆరంభం కానుంది. దీనితో సంస్థలోని పది శాతం కార్పొరేట్ ఉద్యోగులపై ప్రభావం పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌కు ఉన్న 1.58 మిలియన్ ఉద్యోగులలో ఇప్పుడు తొలిగింపునకు గురయ్యే ఉద్యోగుల సంఖ్య కొద్ది పాటిగా ఉంటుంది. అమెజాన్‌లో అత్యధిక సంఖ్యలో వేర్‌హౌసెస్, ఫుల్‌ఫిల్మెంట్ సెంటర్లలో పనిచేసే వారు ఉన్నారు. ఇప్పటి లే ఆఫ్‌లు ప్రాధమికంగా కార్పొరేట్, వైట్ కాలర్ బాధ్యతల్లో ఉన్నవారిపైనే పడుతుంది. అయితే ఈ లే ఆఫ్‌లకు ఆర్థిక అంశాల ప్రభావితం కావని, అదే విధంగా ఎఐ పరిణామాలతో తలెత్తినవి కావని అమెజాన్ సిఇఒ ఆండీ జస్సీ తెలిపారు. కంపెనీ విధానాలు ఇతర విషయాలను పరిగణనలోకి తీసుకుని చేపట్టిన చర్య అని పేర్కొన్నారు. అమెజాన్‌కు ఇటీవలి కాలంలో అత్యధిక సంఖ్యలో బ్యూరోక్రసీ భారం పెరిగిందని, దీనిని సరిదిద్దుకోవల్సి ఉందని వివరించారు. గత ఏడాది అక్టోబర్‌లో సంస్థలో దాదాపు పదివేల ఉద్యోగాలకు కోత పెట్టారు.




