Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedకానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ గ్లింప్స్ విడుదల

కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ గ్లింప్స్ విడుదల

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు. మేఘ లేఖ, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ అవసరాల కీలక పాత్రలు పోషించారు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ నిర్మించారు. ఈ సిరీస్ కి వచ్చిన రెండు సీజన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తాజాగా మేకర్స్ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. కానిస్టేబుల్ కనకం చాప్టర్ 3 కాల్ ఘాట్ సినిమాగా థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు.

అలాగే రెండు సీజన్స్ కలిపి థియేటర్స్ లో సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. కాల్ ఘాట్ చాప్టర్ 3 గ్లింప్స్‌ని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినిదత్ లాంచ్ చేశారు. ఈ వేడుకలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ “కోవెలమూడి సత్య సాయిబాబా తన అనుభవాన్ని అంతా కలబోసి కానిస్టేబుల్ కనకం అనే సక్సెస్‌ఫుల్ ఫిల్మ్ చేశారు. ప్రశాంత్ కుమార్ అద్భుతంగా తెరకెక్కిస్తున్న కానిస్టేబుల్ కనకం ప్రతి సీజను బాహుబలి లాగా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను” అని అన్నారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments