Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedమాయివోస్టు పార్టీలో మిగిలింది 17 మంది నేతలే

మాయివోస్టు పార్టీలో మిగిలింది 17 మంది నేతలే

రాష్ట్రం నుండి మావోయిస్టు పార్టీలో మరో 17 మంది కీలక వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నారని, వారంతా దేశ వ్యాప్తంగా వివిధ కేడర్లలో పనిచేస్తున్నట్లు పోలీస్ శాఖ పేర్కొంది. గతేడాది 576 మంది వివిధ క్యాడర్లలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీస్ శాఖ తెలిపింది. మిగిలిన 17 మంది పై సుమారు కోటికి పైగా రివార్డు ఉన్నట్లు చెప్పింది. రివార్డు వివరాలు పోలీస్ శాఖ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ముప్పాళ్ల లక్ష్మణ్ , సిసిఎం జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ లపై- రూ.25 లక్ష-ల చొప్పున రివార్డు ఉందన్నారు. ఇఆర్‌బి సభ్యులు పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, డివిజనల్ కార్యదర్శి ముప్పిడి సాంబయ్య, డికెఎస్‌జెడ్‌సి సభ్యుడు, కమ్యూనికేషన్ వింగ్ ఇంచార్జ్ వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు, కేంద్ర కమిటీ సభ్యురాలు, డికెఎస్‌జెడ్‌సి ఇంచార్జ్ జోడే రత్నబాయి అలియాస్ సుజాత, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్ రావు అలియాస్ ప్రభాకర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, సైనిక వ్యవహారాల ఇంచార్జ్ బడే చొక్కారావు అలియాస్ దామోదర్ -లపై రూ.20 లక్షలు చొప్పున రివార్డు ఉన్నట్లు చెప్పారు. డిసిఎం స్థాయి కేడర్లు నక్కా సుశీల అలియాస్ రేలా, జాడి పుష్ప అలియాస్ రాజేశ్వరి ల-పై రూ.5 లక్షల చొప్పున, ఏరియా కమిటీ స్థాయి క్యాడర్ సభ్యులు రంగబోయిన భాగ్య అలియాస్ రూపి, బాదిషా ఉంగ అలియాస్ మంతు ఏరియా, మడివి అడుమె అలియాస్ సంగీత, కాశపోగు భవాని అలియాస్ సుగుణ, కుంజం ఇడమల్ -లపై నాలుగు లక్షల చొప్పున, పార్టీ సభ్యుడు, కంప్యూటర్ ఆపరేటర్ ఉతిమి అనిల్ కుమార్ అలియాస్ భగత్ సింగ్ పై లక్ష రూపాయాల రివార్డు ఉన్నట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. –

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments