Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedగురువారం రాశి ఫలాలు (22-01-2026)

గురువారం రాశి ఫలాలు (22-01-2026)

మేషం

కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.

వృషభం

పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కలిసి రావు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వివాదాలకు దూరంగా వుండండి.

మిథునం

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. శ్రమపడ్డ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో స్వల్ప లాభాలు పొందుతారు.

కర్కాటకం

పనులలో పురోగతి సాధిస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు హోదాలు పొందుతారు. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

సింహం

కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. పనులలో ఏర్పడిన అవంతరాలు కొంతవరకు తొలగుతాయి. ఉద్యోగాలలో స్థానమార్పులు. సోదరుల నుండి స్వల్ప లాభాలు పొందుతారు.

కన్య

దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త వల్ల ఆనందం కలుగుతుంది. కార్యజయం పొందుతారు. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విద్యార్థులకు శుభవార్తలు వింటారు.

తుల

వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది.

వృశ్చికం

వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు పొందుతారు. పరపతి పెరుగుతుంది. విద్యార్థులు ఒక ప్రణాళికతో ముందుకు సాగుతారు.

ధనుస్సు

ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వాహనాలు నడిపే విషయాల్లో చాలా జాగ్రత్తగా వుండాలి.

మకరం

బంధువుల నుండి ఎదురైన ఒత్తిడులు కొంత వరకు తీరుతాయి. ఉద్యోగాలలో స్థానచలనం. జీవిత భాగస్వామి తరపు వారి నుండి అనవసరపు నిందారోపణలు.

కుంభం

ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మానసికంగా ఉల్లాసంగా గడుపుతారు.

మీనం

కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా వుంటాయి. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments