
జొహన్నెస్ బర్గ్: సౌతాఫ్రికాలోని గాటెంగ్ ప్రావిన్స్‌లో సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో స్కూల్ బస్సుకు ట్రక్కు ఢీకొని 13 మంది చిన్నారులు మృతి చెందారు. అక్కడికక్కడే 11 మంది చనిపోగా, తీవ్ర గాయాలతో తరువాత మరో ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు.
విద్యార్థులను వివిధ ప్రైమరీ స్కూళ్లకు ఈ ప్రైవేట్ బస్సు తీసుకెళ్తుంటుంది. ఈ మినీ బస్సు పిల్లలను తీసుకెళ్తూ ఇతర స్టేషనరీ వాహనాలను ఓవర్‌టేక్ చేయడంతో ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. ప్రెసిడెంట్ సిరిల్మ్రఫోసా తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ప్రాథమిక విద్యా మంత్రి సివివె గ్యారుబె స్కూల్ రవాణాలో చాలా ప్రమాదాలు డ్రైవర్ నిర్లక్షం వల్లనే జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు.




