
ఆడముజ్ (స్పెయిన్): స్పెయిన్ లోని ఆడముజ్ సమీపాన ఆదివారం సాయంత్రం రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో 39 మంది ప్రాణాలు కోల్పోగా, 159 మంది గాయపడ్డారు. కార్డోబా ప్రావిన్స్ లోని ఆడముజ్ పట్టణ సమీపంలో మాలాగా నుంచి మాడ్రిడ్ వెళ్తున్న హైస్పీడ్ రైలు( ఇరియో) అకస్మాత్తుగా పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును(రెన్పే)ను ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. అక్కడ గల స్పోర్ట్ సెంటర్‌ను తాత్కాలిక ఆస్పత్రిగా ఏర్పాటు చేసి గాయపడినవారికి చికిత్స అందిస్తున్నారు.
మాలాగా నుంచి వెళ్తున్న రైలు చివరి భాగంలో దాదాపు 300 మంది ప్రయాణికులు ఉండగా, మరో రైలులో దాదాపు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ రెండూ ఢీకొనడంతో మంటలు పుట్టాయని రవాణా మంత్రి ఆస్కార్ పుయెంటే చెప్పారు. స్పెయిన్ ప్రదాన మంత్రి పెడ్రో సంచెజ్ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.సోమవారం మాడ్రిడ్, అండలూసా నగరాల మధ్య రైలు సర్వీసులు రద్దు చేశారు.




