Tuesday, March 3, 2026
Google search engine
HomeUncategorizedకాంగ్రెస్‌లో చేరి తప్పుచేశా: మహిపాల్ రెడ్డి

కాంగ్రెస్‌లో చేరి తప్పుచేశా: మహిపాల్ రెడ్డి

 ఆ పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి సహకారం లేదు

మున్సిపోల్స్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించండి

ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పిలుపు

మన తెలంగాణ/పటాన్‌చెరు: కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశానని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నుంచి కానీ, ప్రభుత్వ అధికారుల నుంచి కానీ నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరా. ఆదివారం స్థానిక జిఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన ముఖ్య అనుచరులతో సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజల సహాయ సహకారాలతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని అంటూనే.. కాంగ్రెస్ పార్టీలో చేరడం తప్పు జరిగిందని భావిస్తున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఉన్న కేసుల్లో తానే స్వయంగా కోర్టులకు హాజరవుతున్నట్టు కార్యకర్తలకు వెల్లడించారు. తనపై ఉన్న కేసుల్లో మూడు ఇప్పటి వరకే కొట్టివేశారన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments