
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. సినీ కళ రంగాలలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంటెంట్స్ వారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి హోటల్ వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పని నిదానంగా పూర్తి అవుతుంది. అయినప్పటికీ సంకల్ప బలంతో ముందుకు వెళ్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు చాలావరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. నూతనంగా ఏ పని ప్రారంభించిన ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. విద్యార్థిని విద్యార్థులకు కాలమంతా అనుకూలంగా లేదు చదువుపై శ్రద్ధ వహించాలి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలలో జాగ్రత్తలు వహించాలి. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులైన విద్యావంతులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారు కాలభైరవ రూపు మెడలో ధరించండి. విద్యార్థిని విద్యార్థులు సరస్వతి పూజ చేయించండి అలాగే సరస్వతి హోమం చేయించడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
వృషభ రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల పరంగా మంచి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. వ్యాపారం యొక్క అభివృద్ధి బాగుంటుంది. మీరు ఆశించిన విధంగా లాభాలు ఉంటాయి. స్థిరాస్తులు ఏర్పరచుకోగలుగుతారు. కోర్టు వివాదాలు సమసి పోతాయి తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. రాజకీయరంగంలో ఉన్నవారికి నూతన పదవులు అవకాశాలు కలిసి వస్తాయి. వైద్య రంగంలో ఉన్న వారికి టెక్నికల్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. నలుగురిలో మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఇంట్లో మరొకటి సంపాదన ప్రారంభం అవుతుంది కుటుంబ భారం తేలిక అవుతుంది. విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాలు చదవండి దక్షిణామూర్తి రూపు మెడలో ధరించండి. విద్యార్థిని విద్యార్థులు చదువుపై శ్రద్ధ వహించాలి. విదేశీ వ్యవహారాలు చాలావరకు సానుకూల పడతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది వివాహ పొంతనలు చూసుకొని ముందుకు వెళ్లడం మంచిది. ఈ రాశి వారికి కలిసివచ్చ సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మిధున రాశి వారికి ఈ వారం మద్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఏర్పడుతాయి. సహోదరీ సహోదరుల మధ్య విభేదాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో కూడా అధికారులతో చిన్నచిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగం మారడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. ఏదైనా నూతన వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు జాతకం చూసుకొని ముందుకు వెళ్ళండి. రాజకీయరంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మీరు చేసే పనిలో కృషి కనిపిస్తుంది. ప్రజా ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధమైన వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా చదవండి. అలాగే సుబ్రహ్మణ్యస్వామి వారికి అభిషేకం చేయించండి మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య నాలుగు కలిసివచ్చే రంగు గ్రీన్. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. బంధు వర్గంతో సఖ్యత ఏర్పడుతుంది. కానీ ఆర్థికపరమైన అంశాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో పెట్టుబడి మరియు లాభాలు సమానంగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి చేసే పనిలో నిరాశ కలుగుతుంది. వ్యాపార పరంగా అంతంత మాత్రంగా ఉంటుందని చెప్పవచ్చు. స్థిర నివాసం కోసం ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న వారికి ఈ వారం స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. విదేశాలలో స్థిరపడడానికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. వృత్తి వ్యాపారాలపరంగా కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ రాజులో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం లేదా వినండి మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి కలిసిన వార కంటే కూడా ఈ వారం మద్యస్థ ఫలితాలే సూచిస్తున్నాయి. ఎంతోకలంగా వివాహ ప్రయత్నాలు చేసి విసిగిపోయి ఉన్న వారికి ఈ వారం మీరు కోరుకున్న సంబంధం కుదురుతుంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. సుబ్రహ్మణ్యస్వామి వారికి మంగళవారం రోజున దీపారాధన చేయండి. విద్యార్థినీ విద్యార్థులు సరస్వతీ హోమం చేయించండి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు గ్రీన్. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
సింహ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది అయినా శని ఈ రాశి వారికి బలంగానే ఉన్నారు. సప్తమంలో రాహువు అంత అనుకూలంగా లేరు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా వివాహపరంగా చిన్నచిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. రాజకీయరంగంలో ఉన్నవారికి మంచి పేరు పెట్టారు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారు మరింత కష్టపడండి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయాలలో కొలిక్కి వస్తారు. విద్యార్థినీ విద్యార్థులకు చదువుపై శ్రద్ధ లోపిస్తుంది కష్టపడి చదవండి మంచి ఫలితాలు ఉంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. వివాదాలకు దూరంగా ఉంటారు. విదేశాలకు వెళ్లడానికి వీలు చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. శనివారం రోజు నువ్వుల నూనెతో శని భగవానుడికి అభిషేకం చేయించండి. విద్యార్థినీ విద్యార్థులు వసంత పంచమి రోజున సరస్వతి హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పనిమీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలపరంగా లాభాల బాటలో ఉంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజాదారణ ఎక్కువగా ఉంటుంది పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. వైద్య రంగంలో ఉన్న వారికి హోటల్ రంగంలో ఉన్నవారికి సినీ కళా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు లాభాలు బాగుంటాయి. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అని ఆలోచనలు. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో రొటేషన్ బాగుంటాయి. అలంకరణ సామాగ్రి కోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. నిరాశ వాడు ప్రతిరోజు కూడా గణపతి స్వామి వారిని ఆరాధించండి. విద్యార్థినీ విద్యార్థులు వసంత పంచమి రోజున సరస్వతి హోమం మరియు విద్యా గణపతి హోమం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య రెండు కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
తులా రాశి
తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడచిన వారం కంటే ఈ వారం మరింత బాగుంది. కుటుంబం పరంగా మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు సంఘంలో పేరు ప్రఖ్యాతల కోసం చేసే పనులు కలిసి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగపరంగా కూడా చాలా చక్కగా ఉంది. ఖర్చులు మాత్రం అదుపులో ఉండవు. రూపాయికి రూపాయి ఖర్చు ఉంటుంది. అయితే ఈ ఖర్చు శుభకార్యాలకు చేస్తారు. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రాకుండా చూసుకోండి. ధనం వచ్చిన పేరు ప్రఖ్యాతలు వచ్చిన కొత్త అహం ఏర్పడుతుంది దీనివల్ల జాగ్రత్తగా వ్యవహరించండి. అన్ని నాకే తెలుసు అనే ధోరణిని పక్కన పెట్టండి. కోపాన్ని పక్కనపెట్టి ఎంత శాంతంగా ఆలోచిస్తే అంత మంచిది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఎవరైతే భూమిని అమ్మే అప్పులు తీర్చాలి లేదా వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ కోరిక నెరవేరుతుంది. పనిలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు అధికంగా చేయటం వలన అనుకోని అతిథుల పరిచయం ద్వారా వ్యాపార అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి జరుగుతుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో దీపారాధన చేయడం కానీ శివుడికి అభిషేకం చేయడం కానీ చేయండి అంతా మంచే జరుగుతుంది. ప్రేమ వివాహ సంబంధిత విషయాలలో తల్లిదండ్రులతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి లేదంటే మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది చదువు మీద శ్రద్ధ పెట్టాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారపరంగా మంచి అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి కాలాన్ని ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. సుబ్రహ్మణ్యస్వామి పాశుపత హోమం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థిని విద్యార్థులు ఈ వసంత పంచమి రోజున సరస్వతి మాత పూజ లేదా హోమం చేయించండి మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి కలసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు డార్క్ మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి జరుగుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలపరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి పెరుగుతుంది ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి సానుకూలంగా ఉంటుంది. మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అవకాశాలు వాటి అంతట అవే కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ముఖ్యంగా వ్యాపారంలో మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఒక రూపాయి సంపాదన ఉంటే పది రూపాయల ఖర్చు ఉంటుంది ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. వివాహాది శుభకార్యాలలో ఒక స్పష్టత ఏర్పడుతుంది. సంబంధం కోసం ఎదురు చూసే వారికి ఒక మంచి సంబంధం కుదురుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారు ఒక శుభవార్త వింటారు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. విదేశీ విద్య కోసం చేస్తే ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయం. ప్రభుత్వ ఉద్యోగం పరంగా వీరికి సానుకూలంగా ఉంది. రాజకీయరంగంలోని వారికి కళా రంగంలో ఉన్నవారికి అదేవిధంగా పబ్లిక్ రిలేషన్షిప్ లో ఉన్న వారికీ మంచి అనుకూలత ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభించే విధంగా గ్రహస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా మంచి ఫలితాలు కలుగుతాయి. ఉదర సంబంధిత వ్యాధులు అసిడిటీ అజీర్ణం వంటి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. భూ సంబంధిత విషయ వ్యవహారాలు సానుకులపడతాయి. భూమి కానీ ఇల్లు కానీ కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్రులతో దీపారాధన చేయటం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం చెప్పదగిన విషయం. ఈ వసంత పంచమి రోజున విద్యార్థిని విద్యార్థులు సరస్వతి పూజ కానీ హోమం కాని చేయించడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు మెరూన్. ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ మాట తీరుతో పదిమందిని మెప్పించ గలుగుతారు. పై అధికారులు కూడా మీ పనితనాన్ని మెచ్చుకోగలుగుతారు. రాశి వారికి వ్యాపారపరంగా వృత్తిపరంగా బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉన్నప్పటికీ కొన్ని అనవసరమైన ఖర్చులు వస్తాయి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. సంతాన సంబంధిత విషయ వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఏదైనా అవసరం అయితే తప్ప ఖర్చు పెట్టకుండా ఉండటం చెప్పదగిన సూచన. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దురా ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. ఈ రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం మంచిది. అలాగే దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించండి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థిని విద్యార్థులకు చదువు మీద శ్రద్ద తగ్గుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఏకాగ్రతగా ఉండటం మంచిది. విదేశీ సంబందిత విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. చిన్న చిన్న మాట పట్టింపులకు పోయి పంతాలకు పోయి ఇబ్బందులకు గురికాకుండా ఉండటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి సరైన సమయం. వ్యాపార పరంగా రాజకీయ రంగం వారికి సినీ కళా రంగం వారికి బ్యూటీషియన్స్ వారికి కాస్మాటిక్స్ వారికి ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగం వారికి సానుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ప్రతి రోజు దక్షిణామూర్తి స్తోత్రం చదవడం అలాగే శని స్తోత్రం చదవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారం అంతంత మాత్రానే ఉంది. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఈ రాశి వారికి మానసిక ఇబ్బందులు తలెత్తుతాయి. వృత్తి ఉద్యోగాల మీద శ్రద్ధ పెట్టి ఎక్కువగా ఆలోచించకుండా ఉండటం చెప్పదగిన సూచన. వైద్య వృత్తిలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభానికి కాలము అంతా అనుకూలంగా లేదు. ఏదైనా సరే కొంతకాలం ఆగి ముందుకు వెళ్లడం చెప్పదగిన సూచన. ఉద్యోగ ప్రయత్నంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు దైవదర్శనాలు చేసుకుంటారు. బంధువులలో ఉన్న విభేదాలు సమసిపోతాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మీరు ఏదైతే సాధించాలి అనుకున్నారో ఆ విజయం మీకు దగ్గరలోనే ఉంది. చిన్న చిన్న విషయాలను పట్టించుకుని ఇబ్బంది పడకండి ఎవరో ఏదో అన్నారని చింతించకండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కాలం అంతా అనుకూలంగా లేదు. ఏది ఏమైనా సరే కొంతకాలం ఓర్పు సహనంతో ఆగి ముందుకు వెళ్ళటం మంచిది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా వేయటం చెప్పదగిన సూచన. ఈ రాశి వారు ప్రతి రోజు సుబ్రహ్మణ్యస్వామి అష్టకం చదవడం, సుబ్రహ్మణ్యస్వామికి హోమం చేయించటం ఎనిమిది మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేయటం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్యా 9 కలిసివచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో స్థిరత్వం తక్కువగా ఉంటుంది. వ్యాపారం కూడా అంతంత మాత్రమే ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం చాలా తక్కువగా ఉంటుంది. నలుగురితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా సోదరి సోదరులతోటి సహ ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగిన సూచన. వ్యాపరపరంగా నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తుంది. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. వచ్చిన ధనాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎక్కువగా ధనవ్యయం సూచిస్తుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. ప్రస్తుతం కాలం అంతా అనుకూలంగా లేదు దూర ప్రాంత ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. జీవిత భాగస్వామితో కూడా విభేదాలు వచ్చే అవకాశం లేకపోలేదు. మాట పట్టింపులకు పోకుండా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. స్నేహితులను కానీ బంధువులను కానీ అతిగా నమ్మటం వలన మోసపోయే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్త వహించండి. ఏదైనా ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు నలుగురి సలహాలు తీసుకోవడం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అంతా అనుకూలంగా లేదు. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కాస్త ఇబ్బంది పెడతాయి. అనుకున్న పనులు పెండింగ్లో పడతాయి చేతిదాక వచ్చిన ఉద్యోగం చేజారిపోతుంది. ఏదైనా సరే సామరస్యంగా వ్యవహరించడం మంచిది. సాధ్యమైనంత వరకు మీరు మౌనంగా ఉండి మీ పని మీరు చేసుకోవడం చెప్పదగిన సూచన. సంతానం పరంగాను జీవిత భాగస్వామితో విభేదాలు లేకుండా చూసుకోవడం మంచిది. భూ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగం వారికి రియల్ ఎస్టేట్ రంగం వారికి అడ్మినిస్ట్రేషన్ వారికి అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ వారికి చిరుధాన్య వ్యాపారస్తులకు కూరగాయ వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ రాశి వారు ప్రతిరోజు శని గ్రహ స్తోత్రం చదవండి అలాగే కాలభైరవాష్టకం చదవండి చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 4 కలిసివచ్చే రంగు నేవీ బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు శుక్రవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ వారం చాల అనుకూలంగా ఉంది దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. చేసే పనిలో కష్టం కనిపిస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారు. నలుగురులో మాట పోకుండా నలుగురు మెచ్చే విధంగా మీరు వ్యవహరిస్తారు. ఏదైతే మీరు సాధించాలని పట్టుదలతో ఉంటారో అది నెరవేరుతుంది. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి వృత్తి ఉద్యోగాలలో చిన్న చిన్న సమస్యలు ఉన్న అవి మీకు మీరే పరిష్కరించుకోవాలి. ఏదైనా పని చేసేటప్పుడు నలుగురు సలహాలు తీసుకోవడం మంచిది. అంతిమంగా మీరు తీసుకున్న నిర్ణయమే మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది. సోదర సోదరీమణుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. బంధువులతో కలిసి దూరప్రాంత ప్రయాణాలు దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. విద్యార్థిని విద్యార్థులు ఈ వసంత పంచమి రోజున విద్యా గణపతి హోమం సరస్వతి మాత హోమం చేయించుకోవడం మంచిది. ఈ విద్యా గణపతి హోమం చేయించుకోవడం ద్వారా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చదువు పరంగా అందరికీ కలిసి వస్తుంది. ఈ రాశి వారు దక్షిణామూర్తి రూపుని మెడలో ధరించాలి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి సినీ కళా రంగం వారికి అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి సొంతంగా వ్యాపారం చేసుకునే వారికి బ్యూటీషియన్స్ కి కాస్మోటిక్ వారికి మీడియా డిజైనింగ్ వారికి చాలా అనుకూలంగా ఉంది. భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త వహించడం మంచిది. చిన్న చిన్న మాట పట్టింపులు ఉండే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామితో కూడా వ్యవహరించేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. మనం మాట్లాడేది చక్కగా ఉన్న దాన్ని వక్రీకరించి చూస్తారు కాబట్టి వాక్ శుద్ధి ఉండటం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలము అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా స్నేహితుల సహచర్యం వలన కొంత నష్టపోయే అవకాశం కనిపిస్తుంది జాగ్రత్త వహించండి. తల్లిదండ్రులతో మాట్లాడకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. అయితే సంతాన విషయంలో ఆరోగ్యం విషయంలో చదువు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురితో చర్చించి ముందుకు వెళ్ళటం మంచిది సొంత నిర్ణయాలు పనికిరావు. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కావున జీవితం విరక్తిగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా దైవదర్శనాలు చేసుకోండి. ఈ వసంత పంచమి రోజున విద్యా గణపతి హోమం సరస్వతి మాత పూజ హోమం చేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు కలిసి వచ్చే సంఖ్య 6 ఏదైనా పని మీద బయటకు వెళ్లేటప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు కలుగుతాయి.




